తెలంగాణ (Telangana) సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు (Cm KCR) స్వల్ప అస్వస్థతకు గురైనట్లు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ (KTR) తెలిపారు. గత వారం రోజులుగా ఆయన వైరల్ ఫీవర్ (Viral Fever)తో బాధపడుతున్నారని, దగ్గు (Cough) కూడా ఉందని మంగళవారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్:
CM KCR Garu has been suffering from Viral Fever and Cough for the last one week.
He is being treated at home by his medical team and is being monitored closely. As per Doctors he should be able to get back to normalcy in a few days
ప్రస్తుతం సీఎం కేసీఆర్ (Cm Kcr)కు ఇంటి వద్దనే వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. సీఎం కేసీఆర్ ఆరోగ్యాన్ని వైద్యుల బృందం నిశితంగా పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. కొద్దిరోజుల్లోనే ఆయన కోలుకొని సాధారణ స్థితికి చేరుకుంటారని వైద్యులు చెప్పినట్లుగా మంత్రి కేటీఆర్ ట్వీట్టర్ ద్వారా వెల్లడించారు.