»Sensational Decision Of Governor Tamilisai Rejection Of Mlc Candidatures
Telangana: గవర్నర్ తమిళిసై సంచలన నిర్ణయం..ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాల తిరస్కరణ
తెలంగాణ గవర్నర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను ఆమె తిరస్కరించారు. దీంతో ఎమ్మెల్సీ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులగా ఉన్న దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణకు షాక్ తగిలినట్లైయ్యింది.
తెలంగాణ గవర్నర్ తమిళిసై సంచలన నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ కోటాలో ఎంపికైన ఎమ్మెల్సీల అభ్యర్థిత్వాలను ఆమె తిరస్కరించారు. ఆర్టికల్ 171(5) ప్రకారం ఎమ్మెల్సీ అభ్యర్థులకు అర్హత లేదన్నారు. దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ అభ్యర్థిత్వాలను ఆమె తిరస్కరించడంతో సర్వత్రా చర్చనీయాంశమైంది. రాజకీయ నేతలు సిఫార్సు చేయొద్దని సూచించారు. అర్హత ఉంటే తాను అంగీకరిస్తానని, ఆ ఇద్దరిని ఎంపిక చేయడానికి కావాల్సిన అర్హతలు లేదని ఆమె తెలిపారు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల అభ్యర్థుల ఎంపిక ఇప్పటి వరకూ జరగలేదన్నారు. ఈ విషయంలో రాజకీయ నేతల సిఫార్సు అవసరం లేదన్నారు. దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ రాజకీయాల్లో యాక్టీవ్‌గా ఉన్నారని, అయితే సామాజిక కార్యక్రమాల్లో అంతగా కనిపించలేదని గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు చేశారు. వారు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నట్లుగా ఎక్కడా ఆధారాలు కూడా లేవన్నారు. ఆర్టికల్ 171(5) ప్రకారంగా ఇప్పటి వరకూ అభ్యర్థుల ఎంపిక జరగనేలేదన్నారు. అర్హులను సిఫార్సు చేస్తే తాను ఆమోదిస్తానని స్పష్టం చేశారు.
గత కొన్నిరోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీలో చేరిన దాసోజు శ్రవణ్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే కుర్రా సత్యనారాయణ అభ్యర్థిత్వాల సిఫార్సులను గవర్నర్ తిరస్కరించడంతో బీఆర్ఎస్లో అలజడి రేగింది. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేసిన దాసోజు, మాజీ ఎమ్మెల్యే కుర్రాలను ప్రతిపాదిస్తూ మంత్రిమండలి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ పేర్లను ఆమోదం కోసం గవర్నర్‌కు పంపించగా ప్రభుత్వం పంపిన ఆ ప్రతిపాదనలను గవర్నర్ తిరస్కరించారు. దీంతో మరోసారి బీఆర్ఎస్ వర్సెస్ గవర్నర్‌గా తెలంగాణలోని పరిస్థితులు మారాయి.