»Shakib Al Hasan Scored Most Run In Odi World Cup In Active Players Not Rohit Sharma And Virat Kohli
World Cup Record: వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ రోహిత్, విరాట్ కాదు.. ఎవరో తెలుసా?
ODI ప్రపంచ కప్ 2023 అక్టోబర్ 5 నుండి ప్రారంభమవుతుంది. ఈ టోర్నీలో తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య జరగనుంది. ప్రపంచ కప్‌కు ముందు వన్డేల్లో ఇప్పటి వరకు అత్యధిక పరుగులు చేసి రికార్డు సృష్టించిన ఆటగాడి గురించి తెలుసుకుందాం.
World Cup Record:ODI ప్రపంచ కప్ 2023 అక్టోబర్ 5 నుండి ప్రారంభమవుతుంది. ఈ టోర్నీలో తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య జరగనుంది. ప్రపంచ కప్‌కు ముందు వన్డేల్లో ఇప్పటి వరకు అత్యధిక పరుగులు చేసి రికార్డు సృష్టించిన ఆటగాడి గురించి తెలుసుకుందాం. ఏంటి ఇంకెవరు.. మనోళ్లే అయి ఉంటారు. రోహిత్, లేదా కోహ్లీ అనుకుంటున్నారా.. అయితే మీరు పప్పులో కాలేసినట్లే. వారిద్దరూ కాదు.. ఏంటి షాక్ అవుతున్నారా. ఆ రికార్డు బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ పేరు పై ఉంది. అతడే వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
ఈ ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌కు షకీబ్ కూడా బాధ్యతలు చేపట్టనున్నాడు. షకీబ్ ప్రపంచ కప్ లలో ఇప్పటివరకు ఆడిన 29 ఇన్నింగ్స్‌లలో 45.84 సగటుతో 1146 పరుగులు చేశాడు. ఇది ప్రస్తుత క్రియాశీల ఆటగాళ్లలో అత్యధికం. షబిక్ ప్రపంచకప్‌లో 2 సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు సాధించాడు. అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో భారత సూపర్‌స్టార్ విరాట్ కోహ్లి రెండో స్థానంలో ఉన్నాడు. కోహ్లి ఇప్పటివరకు 26 ఇన్నింగ్స్‌ల్లో 46.82 సగటుతో 1030 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను 2 సెంచరీలు, 6 అర్ధ సెంచరీలు సాధించాడు.
ఈ జాబితాలో ఆస్ట్రేలియా ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ మూడో స్థానంలో ఉన్నాడు. వన్డే ప్రపంచకప్‌లో వార్నర్ 18 ఇన్నింగ్స్‌ల్లో 62 సగటుతో 992 పరుగులు చేశాడు. ఈ సమయంలో వార్నర్ 4 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు సాధించాడు. ప్రస్తుత భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఈ జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. రోహిత్ శర్మ 17 ఇన్నింగ్స్‌లలో 65.2 సగటుతో 978 పరుగులు చేశాడు. అందులో అతను 6 సెంచరీలు, 3 అర్ధ సెంచరీలు సాధించాడు. ఆ జాబితాలో రోహిత్ శర్మ అత్యధిక బ్యాటింగ్ సగటును కలిగి ఉన్నాడు.
న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ 22 ఇన్నింగ్స్‌ల్లో 56.94 సగటుతో 911 పరుగులతో ఐదో స్థానంలో, బంగ్లాదేశ్‌కు చెందిన ముష్ఫికర్ రహీమ్ 28 ఇన్నింగ్స్‌ల్లో 877 పరుగులతో 38.13 సగటుతో ఆరో స్థానంలో, ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ 834 పరుగులతో ఆరో స్థానంలో ఉన్నారు. 20 ఇన్నింగ్స్‌లలో 46.33 సగటుతో ఏడవ స్థానంలో ఉన్నాడు.
ODI ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ (యాక్టివ్ ప్లేయర్స్)
షకీబ్ అల్ హసన్- 1146
విరాట్ కోహ్లీ- 1030
డేవిడ్ వార్నర్- 992
రోహిత్ శర్మ- 978
కేన్ విలియమ్సన్- 911
ముష్ఫికర్ రహీమ్- 877
స్టీవ్ స్మిత్- 834.