»Anushka Sharma Pregnant Virat Kohli Will Be Father 2nd Child Rumours
Virat Kohli-Anushka: గుడ్ న్యూస్.. మరో సారి తండ్రి కాబోతున్న విరాట్ కోహ్లీ
విరాట్ భార్య అనుష్క శర్మ రెండవ బిడ్డకు జన్మనివ్వబోతోందని తెలుస్తోంది. అంటే అనుష్క, విరాట్లు రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు. అయితే దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారం వెల్లడి కాలేదు.
Virat Kohli-Anushka:భారత క్రికెట్ జట్టు వెటరన్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ప్రపంచకప్ 2023 కోసం సిద్ధమవుతున్నాడు. ఇంతలో ఆయన ఇంటి నుంచి పెద్ద శుభ వార్త వచ్చింది. విరాట్ భార్య అనుష్క శర్మ రెండవ బిడ్డకు జన్మనివ్వబోతోందని తెలుస్తోంది. అంటే అనుష్క, విరాట్లు రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు. అయితే దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారం వెల్లడి కాలేదు. దీనికి సంబంధించి కోహ్లి కానీ, అనుష్క కానీ సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ చేయలేదు.
అనుష్క రెండవసారి తల్లి కాబోతోందని ప్రముఖ మీడియా తన ప్రకటనలో వెల్లడించింది. విరాట్ కోహ్లీ మరోసారి తండ్రి కాబోతున్నాడు. “అనుష్క రెండవ సారి తల్లి కాబోతోంది. అయితే గతసారి లాగానే ఈసారి కూడా చివర్లో ఈ వార్తను అందరితో పంచుకుంటారు. అనుష్క 2021 జనవరిలో తన మొదటి బిడ్డకు జన్మనిచ్చింది. అనుష్కకు ఆడపిల్ల పుట్టింది. కోహ్లి-అనుష్క తమ కుమార్తెకు వామిక అని పేరు పెట్టారు’. అని పేర్కొంది.
2023 ప్రపంచ కప్ సమయంలో అనుష్క విరాట్‌తో కలిసి ప్రయాణించదు. ప్రపంచకప్ సందర్భంగా కోహ్లీ వివిధ నగరాల్లో మ్యాచ్‌లు ఆడనున్నాడు. అయితే అనుష్కతో వెళ్లడు. కోహ్లి, అనుష్క తమ మొదటి కుమార్తెను ఇప్పటివరకు ప్రజలకు దూరంగా ఉంచారు. ఇప్పటి వరకు వామిక ఫోటోను వారిద్దరూ సోషల్ మీడియాలో షేర్ చేయలేదు. ఈ విషయంలో కోహ్లీ-అనుష్క చాలా గోప్యంగా ఉండేందుకు ఇష్టపడుతున్నారు. వీరిద్దరూ 2017లో పెళ్లి చేసుకున్నారు. కోహ్లీ-అనుష్క పెళ్లి గురించి ఎవరికీ తెలియదు. పెళ్లి తర్వాత ఇద్దరూ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేశారు. పెళ్లయిన 4 సంవత్సరాల తర్వాత అనుష్క ఒక కుమార్తెకు జన్మనిచ్చింది. వామిక తర్వాత ఇప్పుడు అనుష్క తన రెండో బిడ్డకు జన్మనివ్వబోతోంది.