తెలుగుదేశం అధినేత చంద్రబాబు (Chandrababu) అరెస్ట్‌కు నిరసనగా ఆయన సతీమణి భువనేశ్వరి అక్టోబర్ 2న నిరాహార దీక్ష చేయనున్నారు. అదేరోజా ప్రజలు సైతం తమ సంఘీభావం తెలపాలని, రాత్రి 7-7.05 గంటల వరకు ఇంట్లోని లైట్లు ఆర్చేయాలని టీడీపీ రాష్ట్రాధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Achchennaidu) పిలుపునిచ్చారు. ఇంటి బయటికి వచ్చి కొవ్వొత్తులతో నిరసన తెలపాలని కోరారు. కాగా ఇవాళ రాత్రి 7-7.05 గంటలకు అందరూ శబ్దం చేసి బాబుకు మద్దతు తెలపాలని ఇప్పటికే టీడీపీ (TDP) ప్రకటించింది. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని తెలిసి చాలా మంది బాధపడ్డారని రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) తెలిపారు.
చంద్రబాబు అరెస్టు తట్టుకోలేక దాదాపు 97 మంది చనిపోయినట్లు సమాచారం వచ్చిందన్నారు. నంద్యాల(Nandyala)లో ఇవాళ తెదేపా పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశం జరిగింది. చనిపోయిన 97 మంది పట్ల ఈ సమావేశం సంతాపం వ్యక్తం చేసింది. అనంతరం భవిష్యత్తు కార్యాచరణను అచ్చెన్న ప్రకటించారు. చనిపోయిన వారి కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెబుతామని అచ్చెన్న తెలిపారు. త్వరలోనే టీడీపీ, జనసేన (Janasena) నుంచి కొంతమందితో కమిటీ వేసి క్షేత్రస్థాయిలో పోరాడతామన్నారు. ఇప్పటికే తాము కలిసి పనిచేస్తున్నామని.. ఆదివారం నుంచి 4 రోజులపాటు మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో పవన్ పర్యటిస్తారని తెలిపారు.