రామ్ చరణ్, శంకర్ కాంబోలో వస్తోన్న గేమ్ ఛేంజర్ మూవీ గురించి 3 రోజుల్లో అప్ డేట్ ఇవ్వాలని.. సినిమా విడుదల తేదీని ప్రకటించాలని ఓ అభిమాని కోరాడు. లేదంటే తాను ఆత్మహత్య చేసుకుంటానని చిత్ర బృందాన్ని హెచ్చరించారు.
Ram Charan Fan Suicide Note For The No Updates Of Game Changer
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ (Ram Charan), క్రేజీ డైరెక్టర్ శంకర్ (shankar) కాంబినేషన్లో వస్తోన్న మూవీ గేమ్ ఛేంజర్ (Game Changer). మూవీని దిల్ రాజు నిర్మిస్తున్నారు. సినిమా షూటింగ్ జరుగుతోంది.. కానీ అప్ డేట్స్ ఇవ్వడం లేదు. దీంతో రామ్ చరణ్ డై హార్ట్ ఫ్యాన్ ఒక్కరు హార్ట్ అయ్యారు. ఏకంగా సూసైడ్ నోట్ రాసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మూవీకి సంబంధించి అప్ డేట్స్ 3 రోజుల్లో ఇవ్వాలని.. లేదంటే సూసైడ్ చేసుకుంటా అని అందులో పేర్కొన్నారు. ఇంతకీ అతను ఏమన్నారంటే..?
రామ్ చరణ్ వీరాభిమానిగా తనను తాను ఇంట్రొడ్యూస్ చేసుకున్నారు. గేమ్ ఛేంజర్ మూవీ కోసం గత రెండేళ్ల నుంచి వెయిట్ చేస్తున్నాడట. అయినప్పటికీ సినిమా గురించి ఎలాంటి అప్ డేట్స్ ఇవ్వడం లేదు. మూవీకి సంబంధించి రిలీజ్ డేట్ను 3 రోజుల్లో ప్రకటించాలని అల్టిమేటం ఇచ్చారు. లేదంటే నాలుగో రోజు తాను సూసైడ్ చేసుకుంటానని అందులో పేర్కొన్నారు. తన చావుకు దర్శకుడు శంకర్, నిర్మాత దిల్ రాజు అవుతారని హెచ్చరించారు.
వాస్తవానికి శంకర్ మూవీ తీస్తే.. టైమ్ తెలియదు. రిలీజ్ డేట్ కూడా ఇవ్వరు. ఇక బడ్జెట్ గురించి చెప్పక్కర్లేదు.. పెరుగుతూనే ఉంటుంది. సినిమా నుంచి లీక్స్ వస్తాయెమో అని.. లేదంటే స్టోరీ తెలవద్దు అని ఇన్ఫో బయటకు లీక్ చేయరు. అభిమానులు మాత్రం వెయిట్ చేస్తుంటారు. చరణ్ ఫ్యాన్ పరిస్థితి కూడా అదే.. ఈగర్లీ వెయిట్ చేసి, చివరికీ సూసైడ్ నోట్ రాసేశాడు. సూసైడ్ నోట్తో అయినా చిత్రబృందం దిగి వస్తోందా.. లేదో మరీ.