యాంకర్, నటి హరితేజ కూడా విడాకులు తీసుకుందట. ఇదే అంశంపై సోషల్ మీడియా కోడై కూస్తోంది. దీంతో హరితేజ స్పందిస్తూ.. ఎందుకిలా రాస్తున్నారని ఫైరయ్యారు. తామిద్దరం కలిసే ఉన్నామని క్లారిటీ ఇచ్చారు.
Anchor Hari Teja: సెలబ్రిటీ కపుల్స్‌కు డైవొర్స్ కామన్ అయిపోయాయి. అలా ప్రేమలో పడి.. పెళ్లి చేసుకొని.. ఇలా విడిపోతున్నారు. ఇది ఒకప్పుడు హలీవుడ్.. తర్వాత బాలీవుడ్లో కంటిన్యూ అయ్యింది. టైమ్ మారింది.. ఇప్పుడు టాలీవుడ్.. తెలుగులో హీరో, హీరోయిన్లు, యాంకర్స్ కూడా తమ భర్తలకు గుడ్ బై చెప్పుకుంటున్నారు. సమంత- నాగచైతన్య డైవర్స్ ఎంత సెన్సేషన్ అయ్యిందో అందరికీ తెలిసిందే. తర్వాత కలర్స్ స్వాతి కూడా విడాకులు అంటూ ఒక్కటే గుసగుసలు.. ఇప్పుడు మరో నటి, యాంకర్ పేరు వినిపిస్తోంది. బిగ్ బాస్‌తో క్రేజ్ తెచ్చుకున్న హరితేజ ( Hari Teja) కూడా భర్తతో విడిపోతున్నారట.
క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించింది హరితేజ ( Hari Teja).. తర్వాత బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా లైమ్ లైట్లోకి వచ్చింది. ఇక వెనుతిరిగి చూడలేదు. టీవీ షోలు, సినిమాలతో బిజీగా మారింది. షాప్ ఓపెన్సింగ్ అంటూ తీరిక లేకుండా గడిపింది. రెండు చేతులా సంపాదించింది. బిగ్ బాస్ షోకి రాక ముందు.. 2015లో కర్ణాటకకు చెందిన దీపక్‌ను పెళ్లి చేసుకుంది. వీరికి భూమి అనే కూతురు కూడా ఉంది. వీరిద్దరూ కలిసి ఉండటం లేదని వార్త చక్కర్లు కొడుతోంది.
సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో హరితేజ ( Hari Teja) ఇంటరాక్ట్ అవుతుంటారు. ఆ సమయంలోనే ఓ అభిమాను డైవర్స్ గురించి అడిగాడు. దీంతో అలా విడిపోతున్నారనే విషయం ట్రోల్ అవుతోంది. విడాకులు తీసుకుంటున్నారనే రూమర్లు ఆగడం లేదు. దీంతో సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు హరితేజ ( Hari Teja). నాలుగు రోజులు కనిపించకుంటే ఏవేవో రాస్తున్నారని పేర్కొంది. భర్తతో కలిసే ఉన్నానని.. చక్కగా ఉన్నామని చెప్పుకొచ్చింది. భర్త దీపక్‌తో కలిసి ఉన్న ఫోటో షేర్ చేసింది. దీంతో అయినా హరితేజ ( Hari Teja) విడాకుల అంశంపై ఫుల్ స్టాఫ్ పడుతుందో లేదో చూడాలి.
ప్రస్తుతం హరితేజ ( Hari Teja) ఆస్ట్రేలియాలో ఉంది. ఫ్రెండ్స్‌తో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేయడం విశేషం. కూతురుని తల్లి వద్ద వదిలి.. ఫారిన్ చెక్కేసిందట. భర్త కూడా లేకపోవడంతో అనుమానం వస్తోంది. ఏదీ ఏమైనప్పటికీ నిప్పు లేనిదే పొగ రాదు కదా అంటున్నారు నెటిజన్లు