అశ్లీల వెబ్సైట్లలో తన ఫొటోలు చూసి కంగారు పడ్డట్లు బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తెలిపారు.’నేను టీనేజ్లో ఉన్నప్పుడు నా ఫొటోలు మార్ఫింగ్ (Morphing Photos) చేసి పోర్న్ సైట్లలో పెట్టారు. తోటి విద్యార్థులు ఆ ఫొటోలు చూసి నాపై జోక్స్ వేశారు. స్కూల్ ఎప్పుడు మానేస్తున్నావ్..ఇండస్ట్రీలో ఇక కష్టపడాల్సిన అవసరం లేదు..ఇప్పుడే అందరికీ తెలిసిపోయావ్..అని హేళన చేశారు. ఆ మాటలు నన్ను బాధపెట్టాయి’ అని జాన్వీ చెప్పారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో జాన్వీ వీటన్నింటి గురించి స్పందించింది.
ముఖ్యంగా, ఫొటో మార్ఫింగ్ అంశాన్ని ప్రస్తావించింది.”అప్పుడు నాకు పదేళ్లుంటాయి. స్కూల్లోని కంప్యూటర్ ల్యాబ్ (Computer Lab) లో నా క్లాస్ మేట్ కంప్యూటర్ స్క్రీన్ పై నా ఫొటోలు చూసి నిర్ఘాంతపోయాను. ఆ ఫొటోలు చాలా అసౌకర్యంగా అనిపించాయి. దాదాపు పోర్నోగ్రఫీ సైట్లలో ఉండే ఫొటోల్లా అనిపించాయి. దాంతో నా ఫ్రెండ్స్ నావైపు అదోలా చూడడం మొదలుపెట్టారు.అంతేకాదు, వ్యాక్సింగ్ చేయించుకోలేదా అంటూ ఆటపట్టించారు” అని జాన్వీ గుర్తుచేసుకుంది.