ప్రస్తుతం రాజకీయాలు మరీ ఘోరంగా తయారయ్యాయి. రోజు రోజుకూ మరింత దిగజారి పోతున్నాయి. బీజేపీ (BJP) ఎంపీ బహిరంగంగా చేసిన ఓ పని తీవ్ర విమర్శలకు తావిస్తోంది. అంతేకాదు.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను కుదిపేస్తోంది. యూపీలోని అలీగఢ్(Aligarh)లో జరిగిన ఓ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ సతీశ్ గౌతం, ఓ మహిళా ఎమ్మెల్యే పాల్గొన్నారు. వేదికపై ఇద్దరూ పక్క పక్కనే కూర్చున్నారు. ఈ క్రమంలో ఎంపీ గౌతం (MP Gautam) ఆమెపై చేతులు వేయడంతో ఎమ్మెల్యే ఇబ్బంది పడ్డారు. చేతులు తాకుతూ, భుజంపై చేయి వేస్తూ ఎంపీ వెకిలిగా ప్రవర్తించారు. అనంతరం సీటు మార్చుకుని ఆయన వేరే కుర్చీలో కూర్చున్నారు. ఎంపీ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అక్కడే ఉన్న కొందరు ఈ తతంగాన్ని ఫోన్లలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీంతో నెటిజన్లు (Netizens) ఎంపీని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
ये हैं अलीगढ़ के सांसद सतीश गौतम। जो सरेआम कार्यक्रम के बीच में विधायिका मुक्ता राजा से छेड़खानी कर रहे हैं। इनकी इस हरकत से विधायिका जी भी काफ़ी असहज महसूस कर रही हैं।
जिस पार्टी के सांसद ही शोहदा हो, उसके छुटभैय्या नेता कैसे होंगे? बाक़ी कार्यकर्ता तो न जाने कैसे-कैसे होंगे?… pic.twitter.com/cSAlEqdvjI