మంచిప్ప రిజర్వాయర్ రీ డిజైన్ ఇష్యూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌కు తలనొప్పిగా మారింది. ఆ గ్రామంలోకి ప్రచారానికి రావొద్దని గ్రామస్తులు ప్లెక్సీ ప్రదర్శించారు.
Protest To Bajireddy Govardhan.. Posters Not To Come For Campaign
Bajireddy Govardhan: అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌కు (Bajireddy Govardhan) నిరసన సెగ తగిలింది. ఎన్నికల సమీపిస్తోన్న సమయంలో తమ గ్రామానికి రావొద్దని మంచిప్ప గ్రామస్తులు తీర్మానం చేశారు. అంతేకాదు ప్లెక్సీ ఏర్పాటు చేసి.. ప్రదర్శించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని. .అందుకే తమ ఊరిలో అడుగు పెట్టొద్దని స్పష్టం చేశారు.
మంచిప్ప రిజర్వాయర్ విషయంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. రీ డిజైన్ రద్దు చేయాలని ఆ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. అప్పటి వరకు తమ గ్రామంలోకి రావొద్దని.. ముఖ్యంగా ఎన్నికల ప్రచారం చేయద్దని తేల్చిచెప్పారు. శనివారం రోజున పోస్టర్లు అతికించి నిరసన తెలిపారు. ఫ్లకార్డులు పట్టుకుని గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ నిరసన తెలిపారు.
తమ డిమాండ్‌ను కాదని ఎన్నికల ప్రచారం చేస్తే అడ్డుకుంటామని తెగేసి చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేస్తే తప్పకుండా ఓడిస్తామని శపథం చేశారు. మంచిప్ప రిజర్వాయర్ రీ డిజైన్ రద్దు చేయకుంటే అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరిస్తామని గ్రామంలో తీర్మానం కూడా చేశారు. ఎన్నికల సమయంలో మంచిప్ప రిజర్వాయర్ అంశం బాజిరెడ్డికి (Bajireddy) తలనొప్పిగా మారింది. ఈ అంశంపై ఆయన ఎలా ముందుకెళాతారో చూడాలీ. అక్కడి జనం అయితే వినేట్టు కనిపించడం లేదు.