Pawan Kalyan has high fever.. campaign postponed.. He is coming to Hyderabad
Pawan Kalyan: జనసేనాని పవన్ కల్యాణ్(Pawan Kalyan) తీవ్రజ్వరంతో బాధపడతున్నారు. పిఠాపురం ప్రచారంలో ఆయను వడదెబ్బ తాగినట్టు సమాచారం. దీంతో ఈ రోజు జరగాల్సిన తెనాలి పర్యటన రద్దచేసుకున్నారు. తెనాలిలో నిర్వహించాల్సిన రోడ్ షో, బహిరంగ సభను జనసేన అధికారికంగా రద్దు చేసింది. పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురికావడమే దీనికి కారణమని, ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారని వెల్లడించింది. గత రెండు రోజులుగా పిఠాపురంలోని మండుటెండలో ప్రచారంలో పాల్గొన్న పవన్ అస్వస్థతకు గురయ్యారు. జ్వరంతో బాధపడుతున్న పవన్ కల్యాణ్ చికిత్స కోసం హైదరాబాద్ వెళ్తున్నట్లు సమాచారం. తాత్కాలికంగా ఆయన ప్రచారానికి బ్రేక్ పడింది. ఈరోజు తెనాలితో పాటు, రేపు నెల్లిమర్లలో జరగాల్సిన పర్యటన కూడా వాయిదా పడినట్లు సమాచారం. దీంతో ఆయన అభిమానులు ఆందోళన చెందాల్సిన పని లేదని పార్టీ శ్రేణులు వెల్లడించారు.