కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గట్టుగూడెం వద్ద ఇవాళ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజమండ్రి నుంచి హైదరాబాద్ వెళ్తున్న కేవీఆర్ ట్రావెల్స్ బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతో అదుపుతప్పి బోల్తా పడింది. బస్సులో ఉన్న 48 మందిలో పదమూడు మందికి గాయాలు కాగా వారిని దమ్మపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.