SRD: సంగారెడ్డి జిల్లాలోని ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఈ నెల 21, 22 తేదీల్లో ఇంగ్లీష్ ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇంటర్ అధికారి గోవిందారం తెలిపారు. విద్యార్థులు ఉదయం 9 గంటలకు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని చెప్పారు. పరీక్షలకు గైర్హాజర్ అయితే ఫెయిల్ అయినట్లు పరిగణిస్తామని పేర్కొన్నారు.