»Rbi Extends Rs 2000 Note Deadline For Exchange Till 7 October Here Is Every Detail You Should Know
Rs.2000Note : గుడ్ న్యూస్.. రూ.2000 నోట్ల మార్పిడికి గడువు పెంపు
ఆర్బీఐ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. రూ. 2000 నోట్లను మార్చుకోవడానికి గడువును అక్టోబర్ 7వరకు పొడగించింది. 2000 రూపాయల నోట్లను మార్చుకోవడానికి ఆర్బీఐ మరో అవకాశం కల్పించింది.
Rs.2000Note: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రజలకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. రూ.2000 నోటును మార్చుకునేందుకు గడువు ముగిసిన నేపథ్యంలో ఆర్బీఐ స్పందించింది. చెలామణిలో లేని రూ.2000 నోట్లను మార్చుకునేందుకు సెప్టెంబర్ 30 చివరి తేదీ అని గతంలో ఆర్బీఐ తెలిపింది. గడువు పొడగించే అవకాశం లేదని కూడా అప్పుడే చెప్పేసింది. 2000 నోట్లను మార్చుకోవడానికి ప్రజలకు ఎక్కువ సమయం ఉండదని ఆర్బీఐ స్పష్టంగా చెప్పింది. సెప్టెంబర్ 30 తర్వాత ఈ నోట్లు కేవలం కాగితం ముక్కగా మిగిలిపోతాయని పేర్కొంది.
ఇది ఇలా ఉంటే ఆర్బీఐ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. రూ. 2000 నోట్లను మార్చుకోవడానికి గడువును అక్టోబర్ 7వరకు పొడగించింది. 2000 రూపాయల నోట్లను మార్చుకోవడానికి ఆర్బీఐ మరో అవకాశం కల్పించింది. మే 19న 2000 రూపాయల నోట్లను చెలామణి నుండి తొలగించేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రజలకు 4 నెలల సమయం ఇచ్చింది. తద్వారా ప్రజలు బ్యాంకులకు వెళ్లి ఈ నోట్లను మార్చుకునేందుకు గడువు ఇచ్చింది. రూ.2000 నోట్లను ఒకేసారి రూ.20,000 వరకు మాత్రమే మార్చుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ పరిమితి విధించింది.
సెప్టెంబర్ 1న రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం రూ.2000 నోట్లలో దాదాపు 93 శాతం బ్యాంకింగ్ వ్యవస్థకు తిరిగి వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ నోట్ల మొత్తం విలువ రూ.3.32 లక్షల కోట్లు. బ్యాంకింగ్ వ్యవస్థలోకి రావడానికి దాదాపు రూ.24,000 కోట్లు అంటే 7 శాతం మొత్తం ఇంకా మిగిలి ఉంది. వివిధ బ్యాంకుల నుండి తీసుకున్న డేటా ప్రకారం, డిపాజిట్ చేసిన నోట్లలో 87 శాతం బ్యాంకు ఖాతాలో జమ అయినట్లు తెలుస్తోంది. మిగిలిన 13 శాతం మొత్తాన్ని ఇతర నోట్లతో మార్చుకున్నారు.