»Ycps False Propaganda If Cid Gives Notices I Will Take Notices Nara Lokesh
Ap Politics: వైసీపీది తప్పుడు ప్రచారం..సీఐడీ నోటీసులిస్తే తీసుకుంటా: నారా లోకేశ్
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ కేసులో ఏ14గా నారాలోకేశ్ పేరును చేర్చినట్లు సీఐడీ తెలిపింది. ఈ నేపథ్యంలో ఏ క్షణంలోనైనా సీఐడీ అధికారులు లోకేశ్‌ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వైసీపీ నేతల విమర్శలకు చెక్ పెడుతూ లోకేశ్ ఢిల్లీలో తానున్న ప్రదేశం గురించి తెలిపాడు. సీఐడీ నోటీసులకు భయపడనని అన్నారు.
టీడీపీ (TDP) అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు (Skill Developement Scam Case)లో ఆయన్ని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ఇదే కేసులో నారా లోకేశ్ (Nara Lokesh)ను కూడా సీఐడీ (CID) అధికారులు అరెస్ట్ చేయనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ కేసు (Inner Ring Road Scam Case)లో నారా లోకేశ్‌కు సీఐడీ నోటీసులు ఇవ్వడానికి సిద్ధమైంది. ఈ కేసులో ఆయన్ని ఏ14గా చేర్చుతున్నట్లు తెలిపింది.
అయితే సీఐడీ (CID)కి భయపడి నారా లోకేశ్ (Nara Lokesh) రహస్య ప్రాంతంలో దాక్కుని ఉన్నారంటూ వైసీపీ (YCP) నేతలు విమర్శలు చేస్తున్నారు. ఆ కామెంట్లకు లోకేశ్ ఘాటుగా రియాక్ట్ అయ్యాడు. తాను ఎక్కడికీ పారిపోలేదని అన్నారు. సీఐడీ అధికారులు ఇంత వరకూ తన వద్దకు రాలేదన్నారు. వాళ్లు వచ్చి నోటీసులు ఇస్తే తీసుకుంటానని, దాక్కునే అలవాటు తనకు లేదన్నారు.
తాను ఢిల్లీ (Delhi)కి వచ్చినప్పటి నుంచి ఎక్కడ ఉంటున్నానో అందరికీ తెలుసని నారా లోకేశ్ అన్నారు. కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, వైసీపీ ప్రచారాన్ని ఎవ్వరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదని మండిపడ్డారు. ఢిల్లీలో తాను ఉంటున్న ప్రదేశాల అడ్రస్‌లను కూడా వెల్లడించారు. హోటల్ మౌర్య (Hotel Mourya)లో తాను ఉన్నానని తెలిపారు.
ఢిల్లీలో టీడీపీ నేతలతో సమావేశాల్లో పాల్గొంటున్నానని, ఏపీలోని నేతలు, కార్యకర్తలకు వీడియో కాల్స్ ద్వారా అందుబాటులో ఉన్నానని అన్నారు. ఢిల్లీలోని మౌర్య హోటల్లోనే కాకుండా అశోక రోడ్డులోని ఎంపీ గల్లా జయదేవ్ నివాసం (Mp Galla Jayadev House)లో కూడా ఉన్నానని, అప్పుడప్పుడూ సుప్రీం కోర్టు సీనియర్ లాయర్ అయిన సిద్ధార్థ లూథ్రా (Siddarth Luthra) కార్యాలయానికి వెళ్తున్నానని చెప్పుకొచ్చారు.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ కేసు (Amaravati Inner Ring Road scam Case)లో ఏ14గా ఉన్న నారా లోకేశ్‌కు సీఐడీ (CID) అధికారులు ఏ క్షణమైనా నోటీసులు పంపే అవకాశం ఉందని జోరుగా చర్చ సాగుతోంది. గత 16 రోజుల నుంచి నారా లోకేశ్ ఢిల్లీలోనే ఉంటున్నారని, ఆయనకు నోటీసులివ్వడానికి సీఐడీ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. సీఆర్పీసీ 41ఏ కింద ఆయనకు సీఐడీ నోటీసులు (CID Notices) ఇవ్వనున్నట్లు సమాచారం.