Nara Lokeshను 4వ తేదీ వరకు అరెస్ట్ చేయొద్దు: హైకోర్టు
ఏపీ హైకోర్టులో నారా లోకేశ్‌కు ఊరట లభించింది. స్కిల్ స్కామ్‌లో ముందస్తు బెయిల్ లభించింది. ఫైబర్ గ్రిడ్, ఇన్నర్ రింగ్ రోడ్ పిటిషన్ విచారణ 4వ తేదీకి వాయిదా పడింది.
Nara Lokesh: స్కిల్ స్కామ్‌లో మాజీ సీఎం చంద్రబాబు అరెస్టై జైలులో ఉండగా.. అతని కుమారుడిని కూడా అరెస్ట్ చేయాలని సీఐడీ భావిస్తోంది. అరెస్ట్ చేసిన తర్వాత బెయిల్ కష్టం అని భావించిన నారా లోకేశ్.. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. అక్టోబర్ 4వ తేదీ వరకు అరెస్ట్ చేయొద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.. ఆ రోజు వరకు అరెస్ట్ చేయొద్దని సీఐడీ అధికారులకు స్పష్టంచేసింది. తదుపరి విచారణకు 5వ తేదీకి వాయిదా వేసింది.
ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసులో కూడా నారా లోకేశ్ లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. ఈ కేసు విచారణ వాయిదా వేసింది. అక్టోబర్ 4వ తేదీన విచారిస్తామని హైకోర్టు ధర్మాసనం తెలిపింది. దీంతోపాటు ఇన్నర్ రింగ్ రోడ్ పిటిషన్ కూడా వాయిదా వేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేశ్‌కు 41ఏ నోటీసులు ఇవ్వాలని సీఐడీని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.
స్కిల్ స్కామ్‌లో చంద్రబాబును అరెస్ట్ చేసిన తర్వాత లోకేశ్ ఢిల్లీ వెళ్లారు. అక్కడ చంద్రబాబు బెయిల్ గురించి న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. ఇటీవల టీడీపీ ఎంపీలతో కలిసి రాష్ట్రపతిని కూడా కలిశారు. ఏపీలో జగన్ పాలన గురించి, కక్షసాధింపు రాజకీయాల గురించి వివరించారు.