ATP: డిసెంబర్ 9న న్యూఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జాతీయ “శిల్పగురు” అవార్డు అందుకున్న ధర్మవరం మండలం నిమ్మలకుంటకు చెందిన తోలుబొమ్మల కళాకారిణి డి.శివమ్మను ఎమ్మెల్యే పరిటాల సునీత సత్కరించారు. అనంతపురంలోని తన క్యాంప్ కార్యాలయంలో పరిటాల శ్రీరామ్ తదితర నాయకులతో కలిసి శివమ్మను శాలువాతో సన్మానించి అభినందించారు.