»Hero Navadeep As A29 In Madapur Drug Case 17 Absconding
Madhapur Drugs Case: మాదాపూర్ డ్రగ్స్ కేసులో ఏ29గా హీరో నవదీప్..పరారీలో 17 మంది
మాదాపూర్ డ్రగ్స్ కేసులో రోజుకో ట్విస్ట్ నెలకుంటోంది. తాాజా ఈ కేసు రిమాండ్ రిపోర్ట్‌లో ఏ29గా హీరో నవదీప్‌ను పోలీసులు చూపించారు. అయితే తనకు డ్రగ్స్ కేసుతో ఎటువంటి సంబంధం లేదని నవదీప్ హైకోర్ట్ ను ఆశ్రయించారు. దీంతో నవదీప్‌ను అరెస్ట్ చేయొద్దంటూ టీఎస్ హైకోర్ట్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.
తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ కేసులు (Drugs Case) ఎక్కడోకచోట వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఇటీవలె హైదరాబాద్ (Hyderabad)లోని మాదాపూర్‌లో నమోదైన డ్రగ్స్ కేసు కలకలం రేపుతోంది. ఈ కేసులో ముగ్గురు నైజీరియన్లు అరెస్ట్ అయ్యారు. మరో 5 మంది సినీ ప్రముఖులను కూడా పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం వారికి సెప్టెంబర్ 27వ తేది వరకూ రిమాండ్ విధించింది. ప్రస్తుతం నిందితులు చంచల్‌గూడ జైలులో ఉన్నారు.
ఆగస్టు 31వ తేదిన వెంకటరత్నాకర్ రెడ్డి, బాలాజీ, మురళీ ఇచ్చిన సమాచారం మేరకు మెహిదీపట్నం బస్టాప్‌లో ముగ్గురు నైజీరియన్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని నుంచి డ్రగ్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఈ డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ (Hero Navadeep) ఉన్నట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.
మాదాపూర్ డ్రగ్స్ కేసు (Madhapur Drugs Case) రిమాండ్ రిపోర్ట్‌లో హీరో నవదీప్ పరారీలో ఉన్నట్లు నమోదు చేశారు. నవదీప్‌తో పాటుగా మోడల్ శ్వేత, మరో 15 మంది పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో నవదీప్‌ను ఏ29 నిందితుడిగా చేర్చారు. మరోవైపు బేబీ మూవీ టీమ్‌కు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ కౌన్సిలింగ్ ఇచ్చారు. బేబీ సినిమాలో డ్రగ్స్‌ను ప్రోత్సహించే దృశ్యాలు ఉన్నాయని తెలిపారు.
నవదీప్‌ను అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్ట్ ఆదేశం:
డ్రగ్స్ కేసులో మరికొంత మంది సినీ ప్రముఖులు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఇదిలా ఉంటే ఈ కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదని హీరో నవదీప్ హైకోర్ట్‌ను ఆశ్రయించారు. దీంతో ఆ కేసు నుంచి ఆయనకు ఊరటలభించింది. తాను హైదరాబాద్ లోనే ఉన్నానని, డ్రగ్స్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తనను ఇరికించే ప్రయత్నం జరుగుతోందని నవదీప్ కోర్టుకెక్కారు. ప్రస్తుతం హీరో నవదీప్‌ను అరెస్ట్ చేయొద్దంటూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలిచ్చింది.