తెలంగాణ (Telangana) వ్యాప్తంగా ఇవాళ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఎగ్జామ్ జరుగుతున్న విషయం తెలిసిందే. సంగారెడ్డి జిల్లా పరీక్షా కేంద్రంలో విషాదం నెలకొంది. పరీక్ష రాసేందుకు వచ్చిన రాధిక అనే గర్భిణి మృతి చెందింది. పటాన్చెరు (Patancheru) మండలం ఇస్నాపూర్‌లో పరీక్ష రాసేందుకు వచ్చిన ఎనిమిది నెలల గర్భిణి రాధిక(Pregnant Radhika).. ఎగ్జామ్ హాల్‌కు వెళ్లే తొందరలో వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్లింది. ఎగ్జామ్ హాల్(Exam Hall)కు చేరుకున్న కాసేపటికే బీపీ ఎక్కువై ఒక్కసారిగా కుప్పకూలింది. వెంటనే గమనించిన ఇన్విజిలేటర్.. ఇతర సిబ్బంది ఆమె కుటుంబానికి సమాచారం అందించారు.రాధికతో పాటు వచ్చిన ఆమె భర్త అరుణ్ వెంటనే ఆమెను పటాన్చెరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
రాధిక మరణంతో ఆమె కుటుంబంలో విషాదం అలుముకుంది. ఎనిమిది నెలల గర్భిణి అయినా.. రాత్రింబవళ్లు ఈ పరీక్ష కోసం చాలా కష్టపడి చదివిందని.. తీరా పరీక్ష రాయడానికి వస్తే ఏకంగా ప్రాణాలే పోయాయంటూ ఆమె భర్త కన్నీరుమున్నీరుగా విలపించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది.రాధికకు బీపీ (BP) ఉంది. ప్రైవేటు ఆసుపత్రిలో చూపించుకున్నప్పుడు తనకు బీపీ ఉందని అక్కడి వైద్యులు చెప్పారు. తను గత మూడు వారాల నుంచి బీపీ ట్యాబ్లెట్స్ వాడుతోంది. ఇవాళ సడెన్‌గా పరీక్షా కేంద్రంలో పడిపోయింది. అక్కడి నుంచి ఆసుపత్రికి తీసుకువచ్చేసరికి తనకు పల్స్(Pulse) పడిపోయింది.
గుండెపోటు వచ్చి ఉంటుందని మేం భావిస్తున్నామని డాక్టర్ ప్రియదర్శిని అన్నారు. ఇలా ప్రాణాలే పోతాయని మాత్రం అనుకోలేదని రాధిక భర్త ఆవేదన వ్యక్తం చేశారు ఎన్నో రోజుల నుంచి రాత్రింబవళ్లు కష్టపడుతూ చదివింది పరీక్షకు. గర్భవతి అయినా.. అటు తన ఆరోగ్యం (Health) చూసుకుంటూ.. ఇటు తన ఆశయం కోసం కష్టపడింది. కానీ చివరి నిమిషంలో పరీక్ష రాయలేకపోవడం కాదు ఏకంగా ప్రాణాలే కోల్పోయింది. ఇప్పుడు నా బిడ్డలు తల్లిలేని వారయ్యారని భర్త కన్నీరుమున్నీరు అయ్యారు