»Big Breaking Cabinet Approves Womens Reservation Bill
Big Breaking: మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేబినెట్ ఆమోదం
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో పార్లమెంటు, అసెంబ్లీలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు లభించనున్నాయి.
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. సోమవారం సాయంత్రం మంత్రి మండలి భేటీ అయ్యి రెండు గంటల పాటు కీలక అంశాలపై చర్చలు జరిపింది. ఈ నేపథ్యంలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలియజేసింది. దీంతో ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ మహిళా బిల్లు పార్లమెంట్ సభలో ఆమోదం పొంది చట్టంగా మారితే చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు లభించనున్నాయి.
పార్లమెంట్లో నేడు మోడీ మాట్లాడుతూ కీలక అంశాలను ప్రస్తావించారు. చారిత్రక పార్లమెంట్ భవనానికి నేటితో వీడ్కోలు చెప్పారు. కొత్త భవనంలో రేపటి నుంచి సమావేశాలు జరగనున్నట్లు తెలిపారు. 75 ఏళ్లలో అనేక ఘట్టాలకు వేదికగా నిలిచిన పార్లమెంట్ భవనాన్ని, అందులో జరిగిన తీపి, చేదు అనుభవాలను ఆయన గుర్తు చేసుకున్నారు.