»Good News For Telangana Students Breakfast Scheme From October 24
BreakFast scheme: తెలంగాణ విద్యార్థులకు గుడ్‌న్యూస్..అక్టోబర్ 24 నుంచి బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్
తెలంగాణలోని విద్యార్థులకు సీఎం కేసీఆర్ దసరా కానుకను ప్రకటించారు. దసరా తర్వాత రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్‌ను సర్కార్ ప్రవేశపెట్టనుంది.
సీఎం కేసీఆర్ (CM KCR) సర్కార్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తూ, విద్యార్థుల సంక్షేమానికి పలు కార్యక్రమాలను ప్రవేశపెడుతున్నారు. తాజాగా దసరా కానుకగా అక్టోబర్ 24 నుంచి బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ (Breakfast Scheme)ను అందుబాటులోకి తీసుకురానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతుల విద్యార్థులకు అల్పాహారం పథకాన్ని అందించనున్నారు.
విద్యార్థులకు చక్కని బోధనతో పాటుగా మంచి పోషకాహారం అందించే దిశగా ఈ పథకాన్ని సర్కార్ అమలు చేయనుంది. దీనివల్ల నిరుపేద కుటుంబాల విద్యార్థులకు పౌష్టికాహారాన్ని కేసీఆర్ సర్కార్ అందించనుంది. ఉదయాన్నే వ్యవసాయం పనులు చేయడానికి వెళ్లేవారి పిల్లల ఆకలి తీర్చడానికి ఈ పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
ఈ బ్రేక్‌ఫాస్ట్ పథకం (Breakfast Scheme) తమిళనాడు రాష్ట్రంలో విజయవంతంగా అమలవుతోంది. ఆ పథకాన్ని పరిశీలించాలని ఇటీవలె ఐఏఎస్ అధికారుల బృందాన్ని కేసీఆర్ సర్కార్ పంపింది. వారు పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాతనే తెలంగాణలో ఈ పథకాన్ని తీసుకురానుంది. దసరా కానుకగా ఈ స్కీమ్ అమలు కానుంది. ఈ పథకం కోసం ప్రభుత్వం ప్రతి ఏటా దాదాపు రూ.400 కోట్లను ఖర్చు చేయనుంది.