తమిళనాడు దేవాలయాల్లో ఇకపై మహిళా పూజారులు కనిపించనున్నారు. రాష్ట్రంలోని దేవాలయంలో ముగ్గురు మహిళా పూజారులను నియమిస్తూ సీఎం స్టాలిన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
దేవాలయాల్లో (Temples) ఇకపై మహిళా పూజారులు (Women Priests) రానున్నారు. తమిళనాడు సర్కారు మహిళా పూజారులను నియమించనుంది. ముగ్గురు మహిళలను ఆలయ పూజారులుగా ఏర్పాటు చేయనున్నట్లు సీఎం స్టాలిన్ (Cm Stalin) వెల్లడించారు. రాష్ట్రంలో తొలిసారి మహిళా పూజారులను నియమించడం పట్ల సనాతనవాదులు థ్రిల్ అవుతున్నట్లు సంగీత విద్వాంసుడు టీఎం కృష్ణా తెలిపారు.
తమిళనాడు (Tamilnadu)కు చెందిన ముగ్గురు మహిళా పూజారులు కృష్ణవేణి, ఎస్ రమ్య, ఎన్.రంజితలను ఏర్పాటు చేస్తున్నట్లు సర్కార్ వెల్లడించింది. వీరు రాష్ట్ర ప్రభుత్వ హిందూ మత, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయ పూజారులుగా శిక్షణ తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. త్వరలోనే తమిళనాడు వ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో సహాయ అర్చకులను కూడా నియమించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
பெண்கள் விமானத்தை இயக்கினாலும், விண்வெளிக்கே சென்று வந்தாலும் அவர்கள் நுழைய முடியாத இடங்களாகக் கோயில் கருவறைகள் இருந்தன. பெண் கடவுளர்களுக்கான கோயில்களிலும் இதுவே நிலையாக இருந்தது.
ஆனால், அந்நிலை இனி இல்லை! அனைத்துச் சாதியினரும் அர்ச்சகர் ஆகலாம் எனப் பெரியாரின் நெஞ்சில் தைத்த… https://t.co/U1JgDIoSxb
రాష్ట్రంలో హిందూ మత, ధర్మాదాయ శాఖ 6 అర్చక శిక్షణ పాఠశాలలను నిర్వహిస్తోంది. ఈ అర్చక కోర్సుల్లో మహిళలు చేరడం ఇదే మొదటిసారి కావడం విశేషం. డ్రవిడ మోడల్ ప్రభుత్వం అన్ని కులాల వారిని కూడా పూజారులుగా నియమించేందుకు ప్రయత్నిస్తోంది. మహిళలు గర్భగుడిలోకి అడుగుపెట్టాలని, సమగ్రత, సమానత్వంతో కొత్త శకాన్ని తీసుకురానున్నట్లు తమిళనాడు సీఎం స్టాలిన్ (Cm Stalin) వివరించారు.