»Case Against The Lawyer Who Is Arguing On Behalf Of Chandrababu
Siddartha Luthra: ఇదేందయ్యా ఇది.. చంద్రబాబు తరపున వాదిస్తున్న లాయర్‌పై కేసు!
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు కేసు వాదిస్తున్న సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రాపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
టీడీపీ అధినేత చంద్రబాబు కేసు వాదిస్తున్న సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రాపై కేసు నమోదైంది. ఆయనపై వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు రాజమండ్రి ప్రకాశ్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం చర్చనీయాంశమైంది. ఇటీవల సిద్ధార్థ లూథ్రా సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. స్కిల్ కేసులో రెండ్రోజుల పాటు తీవ్రంగా వాదించినప్పటికీ చంద్రబాబుకు అనుకూలంగా ఫలితం తీసుకురాలేకపోయిన లూథ్రా ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ చేశారు.
న్యాయం కనుచూపు మేరలో కనిపించకపోతే ఇక కత్తి దూసి పోరాడడమే మార్గం అని ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. దీంతో ఆ వ్యాఖ్యలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని రౌతు సూర్యప్రకాశరావు తన ఫిర్యాదులో తెలిపారు. న్యాయాన్ని కాపాడాల్సిన న్యాయవాదులే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. సిద్థార్థ లూథ్రా తన పోస్టును ఉపసంహరించుకుని క్షమాపణలు చెప్పాలన్నారు.