బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) కు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. లిక్కర్ స్కాం కేసులో రేపు విచారణకు రావాలని ఈ నోటీసుల్లో పేర్కొంది. ఈ కేసులో అరుణ్ పిళ్లై (Arun Pillai) ఇటీవల అప్రూవర్ గా మారడంతో నోటీసులు జారీ చేసింది. దీంతో కవిత విచారణ కీలకంగా మారనుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam) కేసు దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఈడీ ఇప్పటికే పలువురిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలో ఈ కేసులో కీలకంగా ఉన్న హైదరాబాద్‌కు చెందిన బిజినెస్మెన్ అరుణ్ రామచంద్ర పిళ్లై అప్రూవర్‌గా మారారు. ఈ మేరకు సీఆర్పీసీ సెక్షన్ 164 కింద ప్రత్యేక న్యాయస్థానంలో వాంగ్మూలం ఇచ్చినట్లుగా సమచారం.
ఈ క్రమంలో అరుణ్ నుంచి నుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Ed) అధికారులు కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. అరుణ్ కవిత బినామీగా ఈడీ అభియోగం మోపింది. గత మార్చి 7న ఈడీ అధికారులు పిళ్లైని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. అంతేకాకుండా పలు దఫాలుగా రామచంద్ర పిళ్లై ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు కూడా నిర్వహించారు. ఈ క్రమంలోనే ఢిల్లీ లిక్కర్ కేసులో ఆయన అప్రూవర్(Approver)గా మారిన తర్వాత కవితకు నోటీసులు జారీ చేయడం కీలకంగా మారింది.కవితను మరోసారి విచారణకు పిలవడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.