బాలీవుడ్ మాజీ నటి బిగ్ బాస్ సీజన్ 12 మాజీ కంటెస్టెంట్ కృతి వర్మ (Kriti Varma) గురించి పరిచయం అవసరంలేని వ్యక్తి. బిగ్ బాస్ ద్వారా బాగా పాపులారిటీని సంపాదించుకుంది. బిగ్ బాస్ సీజన్(Bigg Boss season)లో తన భాగస్వామి రోష్మీ బానిక్తో కలిసి సాధారణ వ్యక్తిగా హౌస్‌లోకి ప్రవేశించింది, షో ప్రారంభమైన కొన్ని వారాల్లోనే ఎలిమినేట్ అయింది. అయితే ఇప్పుడు కృతి పై అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. రూ.263 కోట్ల TDS రీఫండ్ స్కామ్(Refund scam)లో మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ కృతి వర్మ పేరు ఉందని తెలుస్తుంది. ఈ కుంభకోణంలో కృతి వర్మ సహా 14 మంది వ్యక్తులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) సమగ్ర చార్జిషీట్ దాఖలు చేసింది. కృతి వర్మ మాజీ GST ఇన్స్పెక్టర్ (GST Inspector) మరియు ఆమె బిగ్ బాస్ మరియు MTV రోడీస్ వంటి తన టీవీ షోలతో కీర్తిని పొందింది.
భూషణ్ పాటిల్, రాజేష్ శెట్టి వంటి ఇతర నిందితులతో కృతి వర్మకు ఉన్న సంబంధాన్ని కూడా ఛార్జిషీట్ (Charge sheet) పేర్కొంది. ఆమె ఇటీవల గురుగ్రామ్‌లో రూ1.02 కోట్ల స్కామ్ డబ్బును ఉపయోగించి సంపాదించినట్లు నమ్ముతున్న ఆస్తిని విక్రయించింది.. ఈ స్కామ్ నుండి వచ్చిన నిధులు భూషణ్ అనంత్ పాటిల్ యాజమాన్యంలోని M/s SB ఎంటర్‌ప్రైజెస్‌లోని వివిధ బ్యాంకు ఖాతాలకు పంపిణీ చేయబడ్డాయి. ఈ కుంభకోణం (Scandal) లో నిందితులు సంపాదించిన నిధులను లోనావాలా, ఖండాలా, కర్జాత్, పూణే, ఉడిపిలోని రియల్ ఎస్టేట్‌లో, పన్వెల్ మరియు ముంబై(Mumbai)లోని విలాసవంతమైన ఫ్లాట్లలో ఉపయోగించారు.ఈ కేసులో ఆరోపించిన ప్రధాన సూత్రధారి మాజీ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ తానాజీ మండల్ అధికారి, అతను RSA టోకెన్లు, ఉన్నత ర్యాంకింగ్ అధికారుల లాగిన్లను పొందినట్లు చెప్పబడింది..
అయితే ఈ విషయం పై సినీ ఇండస్ట్రీ(Film industry)లో పలు చర్చలు మొదలయ్యాయి.. ఈ స్కామ్ గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.ఢిల్లీకి (Delhi) చెందిన కృతి వర్మ.. 2007- 2009 మధ్య కాలంలో సీనియర్ ట్యాక్స్ అసిస్టెంట్ అధికారిగా (Senior Tax Assistant Officer) పని చేశారు. ఆ సమయంలో ఈమె తన పైఅధికారులకు తెలీకుండా అధికారిక లాగిన్లను ఉపయోగించి మోసాలకు పాల్పడినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) ఆరోపించింది. ఈ కేసులో ప్రముఖ వ్యాపారవేత్త భూషణ్ పాటిల్(Bhushan Patil)ను కీలక నిందితుడిగా గుర్తించారు. పెద్ద మొత్తంలో నిధులు పాటిల్ ఖాతాకు చేరాయని, అందులో కొంత మొత్తం కృతి వర్మ పేరుపై ఆస్తులు కొనుగోలు చేశారని విచారణలో తేలింది.