»21 Year Old Hen Is Now Guinness World Record Holder For Being The World Oldest Living Chicken
World Record: గిన్నిస్ రికార్డ్ సాధించిన 21 ఏళ్ల కోడి..!
ప్రపంచంలోనే ఓ కోడి అత్యధిక రోజులు జీవించి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది. ప్రస్తుతం ఆ కోడి వయసు 21 ఏళ్లు. ఇంకా ఆ కోడి ప్రాణాలతో జీవిస్తోంది. ఆ కోడి తెలివితేటలకు అందరూ ఆశ్చర్యపోతున్నారు.
సాధారణంగా ఓ కోడి జీవితకాలం ఐదేళ్ల పాటే ఉంటుంది. మహా అయితే పదేళ్ల కంటే ఎక్కువ బతకదు. కానీ ఇక్కడొక కోడి 21 ఏళ్లు అయినా ఇంకా జీవిస్తూనే ఉంది. యూఎస్‌లోని ఓ కోడి ఎక్కువ కాలం జీవించి గిన్నిస్ రికార్డు సాధించడం విశేషం. అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రానికి చెందిన ఓ దంపతులు జంతువులను పెంచుకుంటూ ఉంటారు.
తమ పెరట్లో ఎన్నో జంతువులతో పాటుగా ఓ కోడిని కూడా పెంచుతున్నారు. ఆ దంపతులు వారు పెంచుకుంటున్న వాటిలో దేనినీ మాంసం కోసం చంపరు. అందుకే తమ పొలంలో, పెరట్లో ఆ జంతువులు ఎంతో స్వేచ్ఛగా బతుకుతున్నాయి. అందులో వారికి ముఖ్యమైంది ఈ కోడి. ఆ కోడికి పీనట్ అనే పేరు పెట్టారు. ఇప్పటి ఆ కోడి వయసు 20 ఏళ్ల 272 రోజులు.
పీనట్ కోడి చాలా తెలివైనది. ఆ కోడికి రోజూ పెరుగు ఇవ్వాల్సిందే. మార్సి అనే ఆయన ఆ కోడిని పెంచుతున్నాడు. ఆ కోడి తన ఇంట్లో పిల్లులతో ఆడుకుంటుంది. తన యజమాని మార్సీతో కలిసి ఆనందంగా జీవిస్తోంది. కుక్కలతో గొడవ పడుతుంది. తన యజమాని మార్సీతో కలిసి ఆ కోడి జాలీగా టీవీ చూస్తుంది. పీనట్ కోడి తెలివితేటలకు అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ 21 ఏళ్ల కోడి అత్యధిక వయస్సు జీవించి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది.