యాపిల్ యూజర్ల (Apple Users)కు షాకింగ్ న్యూస్. ఆ సంస్థకు చెందిన ఐఫోన్ 12 (iPhone 12)పై ఫ్రాన్స్‌లో బ్యాన్ విధించడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. యాపిల్ ఐఫోన్12 నుంచి అధిక స్థాయిలో రేడియేషన్ (Radiation) వస్తోందని నేషనల్ ఫ్రీక్వెన్సీ ఏజెన్సీ వెల్లడించింది. యూరోపియన్ యూనియన్ విధించిన ఆంక్షల కన్నా అధిక స్థాయిలో ఐఫోన్ 12 నుంచి ఎలక్ట్రోమ్యాగ్నటిక్ తరంగాలు విడుదల అవుతున్నాయి. ఈ విషయంపై ఫ్రాన్స్ పలు ఆరోపణలు చేసింది.
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అన్ని ఐఫోన్ 12 ప్రో ఫోన్ల (iPhone 12 Pro Phones)ను వెంటనే అమ్మడం ఆపివేయాలని ఫ్రాన్స్ ప్రకటించింది. ఈయూ ప్రకారంగా చూస్తే ఐఫోన్ 12 సిగ్నల్స్‌లో స్పెసిఫిక్ అబ్జార్పషన్ రేటు అధికంగా ఉందని, ఐఫోన్ 12 చేతుల్లో ఉన్నా, జేబులో ఉన్నా కూడా దాని నుంచి నాలుగు వాట్స్ శక్తి విడుదల అవుతోందని గుర్తించింది.
ఐఫోన్ 12 (iphone 12) బ్యాగులో ఉన్నప్పుడు దాని నుంచి కేవలం రెండు వాట్స్ శక్తి మాత్రమే వస్తోందని ఓ రిపోర్టు ద్వారా వెల్లడించింది. ఐఫోన్ 12ను అక్టోబర్ 2020లో ప్రవేశపెట్టగా ఇతర మోడల్స్‌తో పోలిస్తే ఆ ఫోన్ ధర చాలా తక్కువగా ఉంది. ప్రస్తుతం ఆ ఫోన్‌పై బ్యాన్ విధించడంతో ఐఫోన్ వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.