»He Is The Highest Paid Person Than Mukesh Ambani In Crores
Mukesh Ambani: ముఖేష్ అంబానీ కంటే అత్యధిక జీతం తీసుకునే వ్యక్తి ఆయనే..ఎన్నికోట్లంటే
దేశంలోని ధనవంతుల్లో ముఖేష్ అంబానీ మొదటి స్థానంలో ఉంటారు. రిలయన్స్ అధినేతగా ఆయన తీసుకునే జీతం అధికం. అయితే ఆయనకంటే మరో వ్యక్తి జీతం ఇంకాస్త ఎక్కువగానే ఉంది. ఆయనెవరో తెలియాలంటే ఇది చదివేయండి.
ఇండియాలో అత్యంత కుబేరుడు ఎవరంటే అందరూ టక్కున ముఖేష్ అంబానీ అని అంటారు. తండ్రి వారసత్వంలో ఆయన వ్యాపార రంగంలో విజయవంతంగా దూసుకుపోతున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) ఛైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ముఖేష్ అంబానీ కొనసాగుతున్నారు. టెలికాం నుంచి రిటైల్ వరకూ అన్ని రకాల వ్యాపారాల్లో తిరుగులేని వ్యక్తిగా ఉన్నారు. సొంతంగా ఫ్లైట్, లగ్జరీ లైఫ్ ఆయన ఫ్యామిలీ సొంతం అని చెప్పాలి.
ముఖేష్ అంబానీ జీతం ఆయన కంపెనీ ఉద్యోగుల కంటే చాలా తక్కువని చాలా మంది తెలీదు. చాలా మంది నమ్మకపోయినా అదే నిజం. ముఖేష్ అంబానీ జీతం కంటే ఆయన కంపెనీలో పనిచేసే మరో ఉన్నత స్థాయి ఉద్యోగి జీతం ఒకటిన్నర రెట్లు అధికం అని అందరీ తెలియదు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీలో అత్యధిక జీతం ఆర్జించే వ్యక్తి నిఖిల్ మెస్వానీ. ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఉద్యోగులు 2.30 లక్షల మంది ఉన్నారు. అందరిలో నిఖిల్ మెస్వానీ దే అత్యధిక జీతం. ఆయన రిలయన్స్ కంపెనీలో కెమికల్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ మేనల్లుడు కావడం విశేషం.
ప్రస్తుతం నిఖిల్ మెస్వానీ RIL పెట్రోకెమికల్ వ్యాపారానికి ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. అంతేకాకుండా ఆయన ఐపీఎల్ క్రికెట్ జట్టు అయిన ముంబై ఇండియన్స్ టీమ్‌ను కూడా పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ఆయన వార్షిక వేతనం రూ.24 కోట్లుగా ఉంది. ఇది అంబానీ జీతం కంటే దాదాపు రెండున్నర రెట్లు ఎక్కువ కావడం విశేషం. ముఖేష్ అంబానీ వేతనం రూ.15 కోట్లు మాత్రమే. అయితే గత మూడు సంవత్సరాలుగా ముఖేష్ అంబానీ జీతం లేకుండానే పనిచేస్తున్నారు.