అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఢిల్లీ (Delhi)లో ఆప్ (AAP) సర్కార్ అమలు చేస్తున్న విధానాలపై సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. ఇదే పరంపరలో కేజ్రీవాల్ సర్కార్ మరో కొత్త నిర్ణయాన్ని ప్రకటించింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచితంగానే బస్సు (Free Bus) సౌకర్యాన్ని కల్పించనున్నట్లు కేజ్రీవాల్ సర్కార్ వెల్లడించింది. ప్రస్తుతం పంజాబ్ రాష్ట్రంలో ఇది అమలవుతుందని తెలిపారు. అయితే ఢిల్లీలో అమలు గురించి క్లారిటీ ఇవ్వలేదు.
పంజాబ్ (Punjab) రాష్ట్రంలోని అమృత్సర్ పట్టణంలో బుధవారం ‘స్కూల్ ఆఫ్ ఎమినెన్స్’ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి అరవింద్ కేజ్రీవాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఢిల్లీలోని పాఠశాలలను తీర్చిదిద్దినట్లుగానే భగవంత్ మాన్ ప్రభుత్వం పంజాబ్‌లో కూడా అదే విద్యా పథకాలను ప్రారంభించినందుకు సంతోషిస్తున్నానన్నారు. ప్రభుత్వ స్కూల్స్‌లో ఉండే సదుపాయాలు అమృత్సర్ లోని ఏ ప్రైవేట్ పాఠశాలలో కూడా లేవన్నారు.
ఈ స్కూల్‌ను స్ఫూర్తిగా తీసుకుని పంజాబ్ లోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను తయారు చేస్తానని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వ పాఠశాలలకు 30 కిలీమీటర్ల పరిధిలో నివశించే పిల్లలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించనున్నట్లు ప్రకటన చేశారు. ప్రస్తుతం పంజాబ్, ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే.