SDPT: వర్గల్ మండలం నాచారం గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్ర హుండీ ఆదాయం రూ. 29,62,845 సమకూరినట్లు ఆలయ ఛైర్మన్ పల్లెర్ల రవీందర్ గుప్తా, ఈవో విజయ రామారావు తెలిపారు. 154 రోజుల హుండీ లెక్కింపు దేవాదాశాఖ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో చేపట్టగా హుండీలో 61 గ్రాముల మిశ్రమ బంగారం, 1.337 కిలోల వెండి భక్తుల ద్వారా లభించినట్లు వివరించారు.