»India Has Demanded An Investigation Into The Death Of An Ap Student In America
Jaahnavi Kandula: అమెరికాలో ఏపీ విద్యార్థి మృతి దర్యాప్తును కోరిన భారత్
అమెరికా(America)లో ఏపీకి చెందిన 23 ఏళ్ల కందుల జాహ్నవి పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఢీకొట్టి మృత్యువాత చెందింది. అయితే ఆ క్రమంలో విచారణ కోసం అక్కడికి వచ్చిన పోలీస్ అధికారి యువతి మృతి పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యాఖ్యలు చేశారు. ఇటివల ఆ వీడియో వెలుగులోకి రావడంతో అనేక మంది అతని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
India has demanded an investigation into the death of an AP student in America
అగ్రరాజ్యం అమెరికాలో తెలుగు యువతి జాహ్నవి కందుల(Jaahnavi Kandula) మృతి గురించి నెట్టింట తెగ చర్చ నడుస్తోంది. అమెరికాలో గత జనవరి 25న ఏపీలోని ఆదోనికి చెందిన 23 ఏళ్ల విద్యార్థిని జాహ్నవి మృతికి సియాటిల్ పోలీస్ కారు కారణమని సోషల్ మీడియాలో వీడియోలు చక్కర్లు కోడుతున్నాయి. అయితే ప్రమాదం జరిగిన తర్వాత విచారణకు వెళ్లిన పోలీస్ ఆఫీసర్ జాహ్నవి మృతిపై చులకనగా మాట్లాడారు. ఆ క్రమంలో తన ఉద్యోగితో ఫోన్ చేసి మాట్లాడిన అంశం ఇప్పుడు వైరల్ గా మారింది. వెలుగులోకి వచ్చిన వీడియోలో పోలీస్ అధికారి ఆమె యాక్సిడెంట్ పట్ల చాలా చులకనగా మాట్లాడారు. ఆమె చాలా సాధారణ వ్యక్తి. ఈ మృతికి విలువ లేదు. పరిహారం ఇస్తే సరిపోతుందని వ్యాఖ్యానించారు. 2021లో కర్నూలు జిల్లా ఆదోని నుంచి సీటెల్‌కు వెళ్లిన కందుల జాహ్నవి నార్త్ఈస్ట్రన్ యూనివర్సిటీలోని సీటెల్ క్యాంపస్‌లో ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చదువుతోంది. వచ్చే డిసెంబర్ నాటికి ఆమె గ్రాడ్యుయేషన్ పూర్తి చేయనుంది.
సోమవారం సియాటెల్ పోలీస్ డిపార్ట్ మెంట్ రిలీజ్ చేసిన వీడియోలో ప్రమాదం గురించి చర్చిస్తున్నప్పుడు అతను నవ్వుతూ మాట్లాడుతున్నాడు. అయితే అతను మాట్లాడిన సంభాషణ మొత్తం పోలీస్ అధికారి బాడీ కామ్ లో రికార్డైంది. ఈ అంశంపై స్పందించిన భారత కాన్సులేట్ జాహ్నవి మృతి కేసును తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపింది. దీంతోపాటు ఈ కేసులో ప్రమేయం ఉన్న వారిపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఒక సీనియర్ ఆఫీసర్ హోదాలో ఉండి అలా ప్రవర్తించడం పట్ల నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు ఈ ఘటనపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్(KTR) స్పందించారు. ఏపీ విద్యార్థిని మృతి చెందడంపై అమెరికా పోలీసు అధికారి దురుసుగా వ్యాఖ్యానించడం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. ఈ విషయాన్ని అమెరికా ప్రభుత్వ అధికారులతో సంప్రదించి జాహ్నవి కందుల కుటుంబానికి న్యాయం చేయాలని.. భారత్‌లోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టిని మంత్రి కేటీఆర్ కోరారు. దీంతోపాటు విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్‌ను కలిసి ఈ విషయాన్ని పరిష్కరించాలని, స్వతంత్ర దర్యాప్తు జరపాలని అభ్యర్థించారు.