సాయిపల్లవి (Sai Pallavi) బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అమిర్‌ఖాన్ తనయుడు జునైద్‌ఖాన్ (Junaid Khan) నటిస్తోన్న ఓ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్గా ఎంపికైనట్లు తెలిసింది. సాయిపల్లవికి తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో మంచి క్రేజ్ ఉంది. తన అభినయం, డ్యాన్స్‌తో సౌత్‌లో విశేష క్రేజ్ సొంతం చేసుకున్న సాయి పల్లవి. స్టార్ హీరో అమిర్ ఖాన్ (Aamir Khan) తనయుడు జునైద్ ఖాన్ త్వరలోనే తెరంగేట్రం చేయబోతున్నాడు. ఆయన నటిస్తున్న తొలి చిత్రాన్ని యశ్‌రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇది పూర్తికాకముందే జునైద్ హీరోగా మరో చిత్రం ఖరారైందని, అందులోనే హీరోయిన్గా సాయి పల్లవిని ఎంపిక చేశారంటూ వార్తలొస్తున్నాయి. సోషల్ మీడియాలోనూ పోస్ట్‌లు వైరల్‌గా మారాయి.
ప్రేమకథా నేపథ్యంలో రూపొందనున్న ఆ సినిమాకి ఆమిర్‌కు సన్నిహితుడైన సునీల్ పాండే (Sunil Pandey) దర్శకత్వం వహిస్తారని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన వెలువడకపోయినా సాయి పల్లవి ఫ్యాన్స్ నెట్టింట ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అదే నిజమైతే సాయిపల్లవికి ఇది ఫస్టు బాలీవుడ్ (Bollywood) సినిమా అవుతుంది. సాయిపల్లవి నటనకి .. డాన్స్ కి అక్కడి ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనేది చూడాలి. మరోవైపు విరాటపర్వం (Virataparvam) తర్వాత టాలీవుడ్‌కు గ్యాప్ ఇచ్చింది సాయిపల్లవి. నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమాలో సాయిపల్లవి నటనకు ప్రశంసలు దక్కినా కమర్షియల్‌గా మాత్రం సినిమా వర్కవుట్ కాలేదు.విరాటపర్వం తర్వాత తెలుగులో కొత్త సినిమా ఏది అంగీకరించలేదు సాయిపల్లవి. తమిళంలో మాత్రం శివకార్తికేయన్(Sivakarthikeyan) తో ఓ సినిమా చేస్తోంది. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ తమిళ మూవీకి కమల్‌హాసన్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నాడు.