ఆంధ్రప్రదేశ్‌లో (Andhrapradeshలో విషాదం నెలకొంది. ఎస్ఐ (SI) దేహదారుఢ్య పరీక్షలో అపశ్రుతి చోటుచేసుకుంది. గుంటూరు (Guntur)లో ఎస్ఐ దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో భాగంగా పరుగు పోటీలో మోహన్ అనే అభ్యర్థి మృతిచెందాడు. పరుగుతీస్తుండగా మోహన్ (Mohan) సొమ్మసిల్లి పడిపోవడంతో స్థానికులు అలర్ట్ అయ్యారు.
మొదట అపస్మారక స్థితిలోకి వెళ్లిన మోహన్ (Mohan)ను పోలీసులు హుటాహుటిన జీజీహెచ్ ఆస్పత్రి (GGH Hospital)కి తరలించారు. అయితే మోహన్‌ను పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లుగా నిర్థారించారు. దీంతో మోహన్ కుటుంబంలో విషాదం నెలకొంది. ఎస్ఐ అవుతాడనుకున్న కొడుకు మరణించడంతో కుటుంబీకులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.