Files missing in former minister Talasanis OSD Kalyan office masab tank
చంద్రబాబు నాయుడు మధ్యంతర బెయిల్ పిటిషన్ వాయిదా పడింది. ఏసీబీ కోర్టు విచారణను ఈనెల 19కి వాయిదా వేసింది. ఈనెల 19లోపు కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం ఈ మేరకు తీర్పునిచ్చింది. మరోవైపు కౌంటర్ దాఖలుకు సమయం కావాలని సీఐడీ అధికారులు కోర్టును కోరారు. దీంతో ఈ నిర్ణయం వెలువరించినట్లు తెలుస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ స్కాం కేసులో ప్రస్తుతం రాజమహేంద్రవరంలో 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్లో చంద్రబాబు నాయుడు A-1గా ఉన్నారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు చంద్రబాబును విడుదల చేయాలని నిరసనలు కొనసాగిస్తున్నారు.
మరోవైపు అన్నమయ్య జిల్లా పర్యటన సందర్భంగా జరిగిన ఘర్షణకు సంబంధించిన కేసులో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ పిటిషన్ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సెప్టెంబర్ 20కి వాయిదా వేసింది. సెప్టెంబరు 14న ఉత్తర్వులను జారీ చేసిన జస్టిస్ కె.సురేష్ రెడ్డి, ఇచ్చిన తేదీలో జరిగిన సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలను సేకరించాలని పోలీసులను ఆదేశించింది.