»Chandrayaan 3 Kissed The Moon India Became The First Country To Plant Its Flag On The South Pole Of The Moon
BIG BREAKING: జాబిల్లిని ముద్దాడిన చంద్రయాన్-3..చంద్రుని దక్షిణ ధృవంపై జెండా పాతిన తొలి దేశంగా భారత్
భారత్ చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం అయ్యింది. చంద్రునిపై ల్యాండర్ సేఫ్‌గా ల్యాండ్ అయ్యింది. దీంతో ప్రపంచంలోనే చంద్రుని దక్షిణ ధృవంపై జెండా పాతిన దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది.
చంద్రయాన్-3 (Chandrayaan-3) ప్రయోగం సక్సెస్ అయ్యింది. జాబిలిని చంద్రయాన్-3 ముద్దాడింది. చంద్రుడిపై ల్యాండర్ సురక్షితంగా దిగి చరిత్ర సృష్టించింది. ఈ మహోన్నత క్షణాల కోసం యావత్ భారతావని ఉద్విగ్నంగా ఎదురుచూసింది. భారత్‌తో పాటుగా ప్రపంచ దేశాలన్నీ కూడా చంద్రయాన్-3ని వీక్షించాయి. ల్యాండింగ్ ప్రక్రియలో చివరి 17 నిమిషాలు ఉత్కంఠగా సాగింది. ల్యాండర్ సురక్షితంగా దిగాలని ఆలయాల్లో హోమాలు, దర్గాల్లో ప్రార్థనలు చేశారు.
చంద్రయాన్-3 ల్యాండ్ అయిన వీడియో:
#WATCH | Indian Space Research Organisation’s (ISRO) third lunar mission Chandrayaan-3 makes soft-landing on the moon pic.twitter.com/vf4CUPYrsE
దేశవ్యాప్తంగా పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. బుధవారం సాయంత్రం 5.44 గంటలకు ల్యాండింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. 17 నిమిషాలపాటు ఆ ప్రక్రియ సాగింది. గంటకు దాదాపు 6 వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న ల్యాండర్‌ను ఇస్రో శాస్త్రవేత్తలు కట్టడి చేశారు. దీంతో చందమామ దక్షిణ ధ్రువంపై ల్యాండర్‌ను సురక్షితంగా దించారు. ఇకపై ల్యాండర్ నుంచి రోవర్ బయటకు వచ్చి చంద్రుడిపై తిరగనుంది. ల్యాండర్ రోవర్ 14 రోజుల పాటు జాబిల్లి ఉపరితలంపై పరిశోధనలు చేయనుందని ఇస్త్రో శాస్త్రవేత్తలు తెలిపారు.