»What Is It That Revolves Around The Moon What Did Nasa Say
NASA: చంద్రుడి చుట్టూ తిరుగుతున్నది ఏంటి.. నాసా ఏం చెప్పిందంటే?
చంద్రుడి చుట్టూ ఓ వింత వస్తువు తిరుగుతున్నట్లు నాసా ఎల్ఆర్ఓ చిత్రీకరించిన ఫోటోలు నెట్టింట్లో ఎంతో వైరల్ అయ్యాయి. అయితే నాసా పంచుకున్న ఆసక్తికరమైన ఫోటోల మిస్టరీ వీడింది.
What is it that revolves around the moon.. What did NASA say?
NASA: ఈ విశ్వం గురించి మనిషికి తెలిసింది చాలా తక్కువ. నిత్యం ఎన్ని ప్రయోగాలు జరిపినా ఇంకా రహస్యాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇప్పటికే గ్రహాంతర వాసులు, ఫ్లయింగ్ సాసర్లు, యూఎఫ్ఓ వంటి అనేక అంశాలు మానవాళికి మిస్టరీగానే ఉన్నాయి. ఇవి నిజంగా ఉన్నాయా, లేదా అనేది నాసాకు సైతం సాధ్యం అవట్లేదు. ఇలాంటి సందర్భంలో స్పేస్లో ఏదైనా వింత వస్తువు కనిపిస్తే అదేంటో కనిపెట్టే వరకు మిస్టరీగానే ఉంటుంది. తాజాగా నాసా కొన్ని ఆసక్తికర ఫొటోలను రిలీజ్ చేసింది. చంద్రమండలం చుట్టు ఓ వింత వస్తువు తిరుగుతున్నట్టుగా ఉన్న ఫోటోలను విడుదల చేసింది. ఆ వస్తువు సిల్వర్ సర్ఫ్ బోర్డ్లా ఉందని నాసా తెలిపింది. దీన్ని లూనార్ రికానైసెన్స్ ఆర్బిటర్ (ఎల్ఆర్ఓ) లోని కెమెరా బంధించింది. ఇది ఏంటని, దీని వలన ఎలాంటి ప్రమాదం ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనలు వేయసాగారు.
అయితే నాసా ఎల్ఆర్ఓ చిత్రీకరించింది వింత ఆకృతిని ఏంటంటే దక్షిణ కొరియాకు చెందిన మరో లూనార్ ఆర్బిటర్ అని తెలిపింది. దక్షిణ కొరియా లూనార్ ఆర్బిటర్ పేరు దనురి. ఇది కూడా చంద్రుడి చుట్టూ పరిభ్రమిస్తూ పరిశోధనల్లో ఉంది. ఇది నాసా ఎల్ఆర్ఓకు అభిముఖ కక్ష్యలోకి రాగా, దాని ఫొటోలను నాసా ఎల్ఆర్ఓ తీసింది. ఈ రెండు లూనార్ ఆర్బిటర్లు ద్రవ్యవేగంలో భారీ తేడా ఉండడంతో.. నాసా ఎల్ఆర్ఓ తీసిన ఫొటోల్లో దనురి ఓ సన్నని గీత వంటి సర్ఫ్ బోర్డ్లా అనిపించింది. దనురి దక్షిణ కొరియా చంద్రుడిపై ప్రయోగించిన మొదటి స్పేస్ క్రాఫ్ట్. 2022 నుంచి చంద్రుడి కక్ష్యలో పరిభ్రమిస్తోంది.