»Good News For Devotees Going To Tirumala Another Vandebharat Train From There
VandeBharath Express: తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్..అక్కడి నుంచి మరో వందేభారత్ రైలు!
తిరుమల శ్రీవారి భక్తుల కోసం రైల్వే శాఖ మరో వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలును నడపనుంది. పుదుచ్చేరి నుంచి తిరుపతికి ప్రత్యేక రైలును నడపనున్నట్లు కేంద్ర రైల్వే శాఖ ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్(Andhrapradesh)కి మరో వందేభారత్ రైలు (VandeBharath Express) రానున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. ముఖ్యంగా తిరుమలకు వెళ్లే శ్రీవారి భక్తుల కోసం ఈ ప్రత్యేక రైలును కేంద్ర రైల్వే శాఖ నడపనున్నట్లు ప్రకటించింది. తిరుపతి నుంచి పుదుచ్చేరికి ఈ వందేభారత్ రైలు ప్రయాణించనుంది. ఇప్పటికే ఆ మార్గాల్లో వందేభారత్ హైస్పీడ్ రైళ్లను మోదీ సర్కార్ పట్టాలెక్కించింది.
సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ఒక వందేభారత్ రైలు ప్రస్తుతం నడుస్తోంది. ఇకపై పుదుచ్చేరి నుంచి కూడా మరో రైలు తిరుపతికి రానుంది. ఆ రెండు నగరాల మధ్య రూ.340 కిలో మీటర్ల దూరం ఉంది. ఈ వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు పుదుచ్చేరి, చెన్నై, తిరుపతి నగరాలను కలపనున్నట్లు కేంద్రం తెలిపింది. ఆ కొత్త రైలు విల్లుపురం జంక్షన్, మధురతంగం, చెన్నై సెంట్రల్, అరక్కోణం స్టేషన్లలో ఆగుతుంది. ఆ రైలును పుదువై వందేభారత్ ఎక్స్ప్రెస్ పేరుతో రైల్వేశాఖ ప్రారంభించనుంది. ఫిబ్రవరి 2024 నుంచి ఆ రైలు పట్టాలెక్కనుంది.
ఇకపోతే ఆగస్టు 31వ తేది నుంచి సికింద్రాబాద్ నుంచి మూడో వందేభారత్ ఎక్స్ప్రెస్ (VandeBharath Express) ప్రారంభం కానుంది. కాచిగూడ నుంచి యశ్వంత్ పూర్ కు ఈ వందేభారత్ రైలు నడవనుంది. ఆ రెండు నగరాల మధ్య ప్రయాణం 12 గంటలు ఉండగా దానిని ఇప్పుడు 7 గంటల వరకే కుదించనున్నారు. దీంతో రైల్వే ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.