ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం జగన్ (CM Jagan) గుడ్ న్యూస్ అందించారు. ఉద్యోగులపై వరాల జాల్లు కురిపించారు. ఏపీ ఎన్జీవో బహిరంగ సభలో పాల్గొన్న సీఎం కీలక హామీలు ఇచ్చారు. పెండింగ్లో ఉన్న డీఏలో ఒకటి దసరా కానుక(Dussehra gift)గా అందిస్తామన్నారు. హెల్త్ సెక్టార్(Health sector)లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు ఐదు రోజుల క్యాజువల్ లీవ్స్ మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. 2019 నుంచి 3 లక్షల 19 వేల ప్రభుత్వ ఉద్యోగులను నియమించామని.. 53 వేల మంది హెల్త్ సెక్టార్లో నియమించామని గుర్తు చేశారు. ఉద్యోగులు (employees) రిటైరయ్యాక వారి జీవితాల్లో మంచి జరగాలని తీసుకొచ్చామన్నారు.
ఉద్యోగ వ్యవస్థను మెరుగుపరిచేలా అడుగులు వేశామన్నారు.వైద్య రంగంలో పని చేస్తున్న మహిళా ఉద్యోగుల(Female employee)కు అదనంగా ఐదు రోజుల క్యాజువల్ లీవ్స్ మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగులు అడిగినవన్నీ ఇవ్వలేకపోవచ్చని, కానీ ప్రభుత్వం తమదని ఉద్యోగులు భావించాలని కోరారు. గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్ (GPS) పై త్వరలోనే ఆర్డినెన్స్ వస్తుందని చెప్పారు. ప్రభుత్వానికి భారం పడకుండా, ఉద్యోగులకు నష్టం లేకుండా జీపీఎస్ విధానం అమలు చేస్తామని హామీ ఇచ్చారు. 2019 నుంచి ఇప్పటిదాకా 3.19 లక్షల మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా నియమించామని వివరించారు. 2.06 లక్షల మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేశామని తెలిపారు. వేతనాల (Wages)పై రూ.3,300 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు.