»Chandrayaan 3 Sent The First Message Prime Minister Modi Said Life Is Blessed
Chandrayan-3: మొదటి మెస్సేజ్ పంపిన చంద్రయాన్-3..జీవితం ధన్యమైందన్న ప్రధాని మోదీ
చంద్రయాన్-3 విజయవంతం అవ్వడంతో భారత్ సంబరాలు చేసుకుంటోంది. ప్రపంచ వ్యాప్తంగా భారత్‌ను ప్రశంసిస్తున్నారు. 14 రోజుల పాటు జాబిల్లిపై విక్రమ్ ల్యాండర్ అనేక పరిశోధనలు చేయనుంది. ఆ సమాచారాన్ని ఇస్రోకు చేరవేయనుంది.
చరిత్రలో భారత్ (India) మరో సరికొత్త రికార్డును నెలకొల్పింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) చేపట్టిన మూన్ మిషన్ చంద్రయాన్-3 (Chandrayan-3) సక్సెస్ అయ్యింది. బుధవారం సాయంత్రం 6.04 గంటలకు ల్యాండర్ విక్రమ్ చంద్రుడి దృక్షిణ ధృవంపై సేఫ్‌గా ల్యాండ్ అయ్యింది. చంద్రుని ఉపరితలంపై అడుగుపెట్టిన తర్వాత ఇస్రోకు ఓ సందేశాన్ని పంపింది. ‘నేను నా గమ్యాన్ని చేరుకున్నా. మీరు (భారత్, ఇస్రో) కూడా’ అంటూ మెసేజ్ చేసింది.
చంద్రయాన్-3 పంపిన మెసేజ్:
Chandrayaan-3 Mission: 'India🇮🇳, I reached my destination and you too!' : Chandrayaan-3
Chandrayaan-3 has successfully soft-landed on the moon 🌖!.
చంద్రయాన్-3 (Chandrayan-3) మూన్‌పై ల్యాండ్ కావడాన్ని ఇస్రో ప్రత్యక్ష ప్రసారం చేయగా ప్రపంచ వ్యాప్తంగా వీక్షించారు. ప్రయోగం విజయవంతం అవ్వడంతో చంద్రుని (MOON) దక్షిణ ధృవంపై కాలుమోపిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. రూ.600 కోట్ల వ్యయంతో భారత్ ఈ మిషన్‌ను చేపట్టింది. జూలై 14న లాంచ్ వెహికల్ మార్క్-III రాకెట్ ద్వారా దానిని ఇస్రో నింగిలోకి పంపించింది.
41 రోజుల తర్వాత అంతరిక్షంలో ప్రయాణించిన చంద్రయాన్-3 ఎట్టకేలకు బుధవారం సాయంత్రం చంద్రునిపైకి చేరింది. ల్యాండర్ విక్రమ్ నుంచి రోవర్ బయటకు వచ్చి సుమారు 14 రోజులపాటు చంద్రుడిపై పలు పరిశోధనలు చేయనున్నట్లు ఇస్రో వెల్లడించింది. అక్కడి నేలలోని ఖనిజాలను, మరిన్ని విషయాలను అది పరిశోధించనుంది. ఆ సమాచారాన్ని ఇస్రోకు చేరవేయనుంది.
చంద్రయాన్-3 (Chandrayan-3) విజయవంతం అవ్వడంతో యావత్ భారతదేశం (INDIA) పులకరించింది. దక్షిణాఫ్రికా నుంచి ఈ అద్భుత క్షణాలను ప్రధాని మోదీ (PM Modi) వీక్షించారు. ఈ సందర్భంగా ప్రధాని అమితానందం వ్యక్తం చేశారు. ఈ చారిత్రక క్షణాలు వీక్షించడంతో తన జన్మ ధన్యమైందని తెలిపారు. భారతీయుడిగా తనకు గర్వంగా ఉందన్నారు.