»South Central Railway The Railway Department Has Canceled A Lot Of Trains
South central Railway: ప్రయాణికులకు షాక్..భారీగా రైళ్లను రద్దు చేసిన రైల్వేశాఖ
దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసినట్లు ప్రకటించింది. ఈనెలాఖరు వరకూ ఆ రైళ్లు రద్దయ్యాయి. విజయవాడకు వెళ్లే సెక్షన్ పరిధిలో వివిధ పనులు నిమిత్తం రైళ్లను రద్దు చేసినట్లు రైల్వేశాఖ వెల్లడించింది.
దక్షిణ మధ్య రైల్వే శాఖ (South central Railway) ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నడిచే 52 రైళ్లను దక్షిణ మధ్య రైల్వేశాఖ రద్దు చేస్తూ ప్రకటన చేసింది. ఈ సర్వీసులన్నీ కూడా మంగళవారం నుంచి ఆగస్టు నెలాఖరు వరకూ నిలిపివేయనున్నట్లు వెల్లడించింది. జన్మభూమి ఎక్స్ ప్రెస్, గరీబ్‌రథ్ ఎక్స్ ప్రెస్, విశాఖ-చెన్నై, తిరుపతి-భువనేశ్వర్ ఎక్స్ ప్రెస్‌లను రద్దు చేస్తూ రైల్వే శాఖ ప్రకటించింది.
ఇకపోతే హైదరాబాద్ (Hyderabad) నుంచి హైదరాబాద్-కటక్ మధ్య నడిచే రైళ్లను కూడా రద్దు చేసింది. గుండాలా నుంచి విజయవాడకు వెళ్లే సెక్షన్ పరిధిలో నాన్ ఇంటర్ లాకింగ్ పనుల వల్ల రైళ్లను రద్దు (Trains Cancelled) చేస్తున్నట్లుగా రైల్వే శాఖ ప్రకటించింది. రద్దు చేసిన రైళ్ల వివరాలను వెల్లడిస్తూ ప్రకటన చేసింది.
ఆగస్టు 23వ తేది వరకు
కటక్-హైదరాబాద్ (07166) రైలును రద్దు చేశారు.
27వ తేది వరకు
కాకినాడ టౌన్-లింగంపల్లి (12775),
లింగపల్లి-కాకినాడ టౌన్ (12776),
విశాఖపట్నం-సికింద్రాబాద్-విశాఖపట్నం (12783/84) రైళ్లను రద్దు చేశారు.
ఈ నెల 29 వరకు
విశాఖపట్నం-లింగంపల్లి (12805),
విశాఖపట్నం-మహబూబ్‌నగర్ (12861),
30వ తేదీ వరకు
లింగంపల్లి-విశాఖపట్నం (12806),
మహబూబ్‌నగర్-విశాఖపట్నం (12862) రైళ్లను దక్షిణ మధ్య రైల్వే శాఖ రద్దు చేసింది.