MNCL: బెల్లంపల్లిలోని కాంట్రాక్టర్ బస్తీ 18వ వార్డులో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కాలనీవాసులు సబ్ కలెక్టర్ మనోజ్‌కు సోమవారం వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ.. కమర్షియల్ వార్డుగా చేసి అధికంగా ఆస్తి పన్నులు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. MLA వార్డును దత్తత తీసుకొని అభివృద్ధి చేయాలన్నారు. కాలనీలో డ్రైనేజీ, నూతన సీసీ రోడ్లు నిర్మాణం చేపట్టాలన్నారు.