»Is That Kcrs Election Strategy A Discussion On The Declaration Of Candidates Before
Telangana: కేసీఆర్ ఎన్నికల వ్యూహం అదేనా? ముందే అభ్యర్థుల ప్రకటనపై సర్వత్రా చర్చ!
తెలంగాణలో అన్ని పార్టీల కంటే ముందుగా సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. రెండు నియోజకవర్గాల నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ అన్ని పార్టీల కంటే ముందుగానే తమ అభ్యర్థులను ప్రకటించారు. 115 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించి పొలిటికల్ హీట్‌ను పెంచారు. కర్ణాటక ఎలక్షన్స్ తర్రవాత ఇప్పుడు అన్ని పార్టీల దృష్టి తెలంగాణపైనే ఉంది. అప్పటి నుంచే తెలంగాణలో ఎన్నికల వాతావరణం భారీగా ఉంది. ఆగస్టు నెలలో అన్ని పార్టీలు తమ తమ అభ్యర్థులను ప్రకటిస్తాయని జోరుగా ప్రచారాలు జరిగాయి.
అందరికంటే ముందుగా బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. నాలుగు స్థానాలను మాత్రం పెండింగ్‌లో పెట్టింది. తొలి జాబితాలో పెద్దగా మార్పులేమీ చేయలేదు. కేసీఆర్ ముందుగా చెబుతున్నదాని ప్రకారమే దాదాపుగా సిట్టింగ్‌లందరికీ టికెట్‌ను ఖరారు చేశారు. కేసీఆర్ మాత్రం అటు గజ్వేల్‌తో పాటుగా ఇటు కామారెడ్డి నుంచి బరిలోకి దిగుతున్నారు. మూడోసారి అధికారం కోసం సీఎం కేసీఆర్ వ్యూహంలో భాగంగానే ఈ అభ్యర్థుల ప్రకటన జరిగినట్లు చర్చ జరుగుతోంది.
అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా సీఎం కేసీఆర్ రెండు స్థానాల్లో పోటీ చేయడంపైనే చర్చ జరుగుతోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 2018లో ఒక్క ఎల్లారెడ్డి నియోజకవర్గంలో తప్పా మిగిలిన 8 స్థానాల్లోనూ కేసీఆర్ పార్టీ విజయం సాధించింది. అయితే ఈసారి మాత్రం అక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య త్రిముఖ పోరు నెలకొంది. సీఎం ఆ ప్రాంతంలో నిలబడితే మిగిలిన నియోజకవర్గాల్లో కూడా ఆ ప్రభావమే ఉంటుందని, కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాలపై ఫోకస్ చేశారు.
ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్టుగానే దుబ్బాక, స్టేషన్‌ఘన్‌పూర్, ఉప్పల్, వైరా, ఖానాపూర్, వేములవాడ, కామారెడ్డి, బోధ్, కోరుట్ల నియోజకవర్గాల్లో కేసీఆర్ పార్టీ తమ అభ్యర్థులను మార్చింది. కామారెడ్డి నుంచి సీఎం పోటీ చేయగా కోరుట్ల నుంచి సిటింగ్ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు కుమారుడికి టికెట్ లభించింది. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను ఎంపీగా నిలబెట్టే అవకాశం ఉంది.
మరో నాలుగు స్థానాల్లోని నాంపల్లి, గోషామహల్ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు. దీంతో ఎంఐఎంకు పరోక్షంగా కేసీఆర్ పార్టీ సహకరించకవచ్చు. జనగామలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నర్సాపూర్‌లో సునీత లక్ష్మారెడ్డి బరిలోకి దిగే అవకాశం ఉంది. టికెట్లు దక్కని వారు నిరాశపడవద్దని, రాజకీయ జీవితమంటే ఎమ్మెల్యేగా పనిచేయడమే కాదని, ఎమ్మెల్సీ, రాజ్యసభ ఎంపీ ఇలా అనేక అవకాశాలు ఉంటాయని సీఎం కేసీఆర్ సూచించారు. పార్టీలో ధిక్కార స్వరం వినిపిస్తే సహించేది లేదని వార్నింగ్ కూడా ఇచ్చారు.