»Which Country Has More Rights To The Original Moon Resources
Moon resources: అసలు చంద్రుడిపై హక్కులు ఎవరికి ఎక్కువ?
చంద్రుని(moon)పైకి అనేక దేశాలు ఉపగ్రహాలు పంపుతున్న నేపథ్యంలో అసలు చందమామపై ఏ దేశానికి ఎక్కువ హక్కులు ఉన్నాయి. అక్కడి వనరులు ఎవరికి సొంతం? దీనిపై ఏదైనా ఆంక్షలు ఉన్నాయా లేదా అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
which country has more rights to the original moon resources
అమెరికా వ్యోమగామి చంద్రుడిని సందర్శించిన మొదటి వ్యక్తి. అయితే యునైటెడ్ స్టేట్స్ దానిని కలిగి ఉందని దీని అర్థం కాదు. వాస్తవానికి 1967 ఔటర్ స్పేస్ ట్రీటీ ఒప్పందం ప్రకారం చంద్రునిపై ఏ దేశానికీ ప్రత్యేకమైన యాజమాన్య హక్కులు లేవు. అన్ని దేశాలకు సమాన హక్కులు(rights) ఇవ్వబడ్డాయి. కాబట్టి ప్రతి దేశం భూమికి ఉన్న ఏకైక సహజ ఉపగ్రహాం చంద్రుడిపై అందరికీ హక్కులు ఉన్నాయని నిపుణులు స్పష్టం చేశారు. అంతేకాదు అన్ని దేశాల ప్రయోజనం కోసం మాత్రమే అన్వేషణ చేయాలని ప్రస్తావించారు. కానీ చంద్రునిపై ఏదైనా ప్రాంతంపై హక్కుల ప్రకటన గురించి ప్రస్తావించలేదు.
ఈ క్రమంలోనే 1979లో మరో మూన్ అగ్రిమెంట్(agreement)జరిగింది. దీని ప్రకారం ఏ ప్రభుత్వం లేదా సంస్థలు చంద్రుడిని తమ ఆస్తి అని ప్రకటించుకోవడానికి వీలు లేదని పేర్కొన్నారు. కానీ ఈ ఒప్పందాన్ని అన్ని ప్రధాన అంతరిక్ష ప్రయాణ దేశాలు ఆమోదించలేదు. యునైటెడ్ స్టేట్స్, రష్యా, చైనా ప్రధాన దేశాలన్నీ దీనిని పాటించలేదు. ఈ ఒప్పందం 1984లో అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో మనం దానిని సురక్షితంగా విస్మరించవచ్చని కొంత మంది చెబుతున్నారు. కానీ అలా చేయోద్దని ప్రజల(people) ఉపయోగం కోసం మాత్రమే వినియోగించాలని మరికొందరు అంటున్నారు.
ఆ తర్వాత ఈ ఒప్పందాల నేపథ్యంలో 2020లో అమెరికా(USA) అర్టెమిస్ ఒప్పందాన్ని ప్రతిపాదించింది. అయితే చంద్రునిపైకి(moon) సురక్షితంగా ప్రయోగాలు చేపట్టడమే దీని లక్ష్యం. దీనిలో కెనడా, జపాన్, ఐరోపా సహా పలు దేశాలు ఉన్నాయి. ఈ అగ్రిమెంటులో భారత్ ఇటివల చేరడం విశేషం.