»Which Countries With The Highest Divorce Rates In 2023
Divorces: విడాకులు ఎక్కువగా తీసుకునే దేశం ఏదో తెలుసా?
విడాకుల(Divorce) సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రదేశాలలో విడాకులు తీసుకోవడం సర్వసాధారణంగా మారింది. ఈ క్రమంలో ఏ దేశంలో ఎక్కువ మంది విడాకులు తీసుకుంటున్నారో ఇప్పుడు చుద్దాం.
ఈ రోజుల్లో పెళ్లి చేసుకోవడం ఎంత సులువో, విడాకులు(Divorce) తీసుకోవడం కూడా అంతే సులువుగా మారింది. ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం.. ఇలా తిరిగి ఒక సంవత్సరం కలిసి ఉంటున్నారో లేదో, వెంటనే విడాకులు తీసుకుంటున్నారు. పిల్లలు లేకపోతే సంతోషం. పిల్లలు ఉంటే.. వాళ్లు తల్లి దగ్గరో, తండ్రి దగ్గరో పెరుగుతున్నారు.
ఈ తంతు మన దేశంలోనే కాదు.. ప్రపంచ దేశాల్లోనూ ఇదే జరుగుతోంది. ఇంకా చెప్పాలంటే ఈ విషయంలో కాస్త భారత్(india) నయం. విడాకులు తీసుకునే దేశాల్లో మన దేశమే కాస్త బెటర్ అట. మిగిలిన దేశాలు మరీ దారుణంగా ఉన్నాయట. ఇటీవల చేసిన సర్వేలో ఈ విషయాలు బయటపడ్డాయి.
ఇటీవల ఓ సంస్థ ప్రపంచం(world wide)లోని ప్రముఖ దేశాలు, వివాహ వ్యవస్థలు, వివాహం విచ్చిన్నమైతే తీసుకున్న విడాకులకు సంబంధించి సర్వే నిర్వహించింది. ఆయా దేశాల ప్రజల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకొని కీలక విషయాలు వెల్లడించింది. ఈ జాబితాలో పోర్చుగల్ 94%, స్పెయిన్, 85% విడాకులతో మొదటి రెండు స్థానంలో ఉన్నాయి. లక్సెం బర్గ్ 79%, రష్యా 73%, ఉక్రెయిన్ 70%, క్యూబా 55%, ఫిన్లాండ్ 55%, బెల్జియం 53%, ఫ్రాన్స్ 51%, స్వీడన్ 50 శాతం, నెదర్లాండ్ 48%, కెనడా 47%, డెన్మార్క్, దక్షిణ కొరియా 46%, యునైటెడ్ స్టేట్స్ 45%, చైనా 44%, ఆస్ట్రేలియా 43%, న్యూజిలాండ్ 41%, యునైటెడ్ కింగ్డమ్ 41%, జర్మనీ 38%, జపాన్ 35%, పోలాండ్ 33%, కొలంబియా 30%, టర్కీ 25%, బ్రెజిల్ 21%, దక్షిణాఫ్రికా, మెక్సికో 17%, ఇరాన్ 14 %, తజకిస్తాన్ 10%, వియత్నాంలో 7% జంటలు విడాకులు తీసుకుంటున్నాయి.
ఈ దేశాలతో పోలిస్తే భారత్ లో వివాహ వ్యవస్థ కాస్త పటిష్టంగానే ఉంది. అందుకే ఇక్కడ కాస్త విడాకుల శాతం(Divorce percentage) తక్కువగా ఉంది. మరి మన దేశంలో విడాకుల శాతం తక్కువగా ఉండటానికి కారణాలు ఉన్నాయి. మన దగ్గర పెళ్లికి విలువ ఇస్తారు. మన దగ్గర కూడా విడాకులు తీసుకుంటున్నారు. కానీ చాలా తక్కువ అనే చెప్పాలి.
ఎందుకంటే, మన దగ్గర పెళ్లి అంటే ఇద్దరు వ్యక్తులు కాదు. రెండు కుటుంబాల(family) కలయిక. భార్యభర్తల మధ్య సమస్య వస్తే.. పెద్దలు అండగా నిలుస్తారు. వారి సమస్యను పరిష్కరించడానికి, వారికి కలపి ఉంచడానికి ప్రయత్నిస్తారు. అందుకే.. ఇక్కడ కాస్త తక్కుగా జరుగుతున్నాయి. ఈ మధ్య మన దేశంలో పాశ్చాత్య సంస్కృతి ధోరణి పెరుగుతోంది. త్వరలో మనం కూడా ఈ విషయంలో ఇతర దేశాలతో పోటీ పడే అవకాశం కూడా లేకపోలేదు.