Serena Williams : రెండోసారి పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సెరెనా విలియమ్స్
ప్రపంచ టెన్నిస్ దిగ్గజం అయిన సెరెనా విలియమ్స్ మరోసారి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా ఆమెకు సోషల్ మీడియా వేదికగా అందరూ అభినందనలు తెలుపుతున్నారు.
అమెరికా (America) టెన్నిస్ దిగ్గజం అయిన సెరెనా విలియమ్స్ (Serena Williams) మరోసారి ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. తన బిడ్డకు ఆమె అధీరా రివర్ ఒహానియా అనే పేరును పెట్టారు. ఈ విషయాన్ని సెరెనా విలియమ్స్ భర్త, ప్రముఖ పారిశ్రామిక వేత్త అయిన అలెక్సిస్ ఒహానియర్ ట్విటర్ వేదికగా వెల్లడించారు. ట్విట్టర్లో నోట్ రాసుకొస్తూ.. వెల్కమ్ అధీరా రివర్ ఒహానియా అంటూ ఆయన ట్వీట్ చేశారు. సెరెనా తన ఇద్దరు కుమార్తెలతో కలిసి ఉన్న ఫొటోలను ఈ సందర్భంగా ఆయన షేర్ చేయడం విశేషం.
తల్లీ, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని, ఇప్పుడు తమ ఇళ్లంతా ఆనందంతో నిండిపోయిందని అలెక్సిస్ ఒహానియర్ ట్వీట్లో చెప్పుకొచ్చారు. తనకు సెరెనా విలియమ్స్ మరో అద్భుతమైన బహుమతి ఇచ్చిందని, గ్రేటెస్ట్ మదర్ ఆఫ్ ఆల్‌టైమ్ అంటూ భార్యపై అలెక్సిస్ ప్రశంసలు కురిపించారు. సెరెనా (Serena Williams)-అలెక్సిస్‌కు ఇప్పటికే ఓ పాప ఉండగా ఇప్పుడు రెండో బిడ్డకు జన్మనిచ్చింది. సెరెనాకు తోటి క్రీడాకారులు, అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు.
సెరెనా విలియమ్స్ కు ఇప్పుడు 41 ఏళ్లు కాగా మహిళల సింగిల్స్ లో 23 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ ను ఆమె గెలుచుకుంది. ఓపెన్ ఎరాలో అత్యధిక టైటిల్స్ గెలిచిన వారిలో సెరెనా విలియమ్స్ (Serena Williams) రెండో స్థానంలో నిలవడం విశేషం. 319 వారాల పాటు వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకులో సెరెనా కొనసాగగా గత ఏడాది సెప్టెంబరులో ఆమె టెన్నిస్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించింది.
Welcome, Adira River Ohanian.
I'm grateful to report our house is teaming with love: a happy & healthy newborn girl and happy & healthy mama. Feeling grateful. @serenawilliams you've now given me another incomparable gift — you're the GMOAT. Thanks to all the amazing medical… pic.twitter.com/AUwvt8JprI