»Is This The Budget Of Chandrayaan 3 Adipurush Movie Budget Is Being Trolled
Chandrayaan 3: ఖర్చు ఇంతేనా..ట్రోల్ అవుతున్న ఆదిపురుష్!
ఆగస్టు 23న చంద్రయాన్ 3(Chandrayaan 3) చంద్రుడిపై విజయవంతంగా ల్యాండ్ అయింది. ఈ చారిత్రాత్మక విజయం నేపథ్యంలో ప్రభాస్ యాక్ట్ చేసిన ఆదిపురుష్(Adipurush) మూవీని తెగ ట్రోల్ చేస్తున్నారు. అసలు ఈ మూవీని ఎందుకు ట్రోల్ చేస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
Is this the budget of Chandrayaan 3 Adipurush movie budget is being trolled
ఆగస్టు 23, 2023 చంద్రయాన్ 3(Chandrayaan 3) సాయంత్రం 6.04 గంటలకు చంద్రుని దక్షిణ ధృవం మీద దిగి భారతదేశం చరిత్ర సృష్టించింది. అయితే ఈ ప్రయోగానికి అయిన ఖర్చు గురించి ప్రస్తుతం ఓ న్యూస్ తెగ వైరల్ అవుతుంది. చంద్రయాన్ 3 బడ్జెట్ ప్రభాస్ యాక్ట్ చేసిన ‘ఆదిపురుష్(Adipurush)’ మూవీ కంటే తక్కువ ఉందని పలువురు అంటున్నారు. అంతేకాదు తక్కువ ఖర్చుతో రూపొందించిన చంద్రయాన్ 3 చరిత్రలో శాశ్వత స్థానాన్ని సంపాదించుకోగా, ‘ఆదిపురుష్’ మాత్రం బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలైందని సోషల్ మీడియాలో ట్రోల్(trolls) చేస్తున్నారు.
🎬 Cost of Hollywood Films about Space 🇺🇸
• Avatar – $237 Million • Interstellar – $165 Million • Passengers – $110 Million • The Martian – $108 Million • Gravity – $100 Million
ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్(Adipurush)’ చిత్రాన్ని మొదట రూ.500 కోట్లతో తెరకెక్కించారు. కానీ విజువల్ ఎఫెక్ట్స్ చెత్తగా ఉన్నాయని విమర్శలు రావడంతో మళ్లీ మార్పులు చేశారు. దీంతో దాని బడ్జెట్ రూ.700 కోట్లకు పెరిగిందని నివేదికలు చెబుతున్నాయి. అయితే ఈ చిత్రం జూన్ 16న థియేటర్లలో విడుదలై ప్లాప్ టాక్ తెచ్చుకున్నప్పటికీ 400 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టింది. ఇక చంద్రయాన్ 3 కేవలం $75 మిలియన్ల ఖర్చుతో (సుమారు రూ.615 కోట్లు) నిర్మించబడింది. చంద్రయాన్ 3 మొదట ఆమోదిత వ్యయం రూ.250 కోట్లు (ప్రయోగ వాహన ఖర్చులు మినహా) అని తెలుస్తోంది.
అంతేకాదు చంద్రయాన్ 3 బడ్జెట్ గురించి టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్(musk) కూడా గతంలో ప్రస్తావించారు. దీని ఖర్చు ఇంటర్స్టెల్లార్ మూవీ బడ్జెట్ కంటే తక్కువగా ఉందని మస్క్ ట్వీట్ చేశారు. ఇది “భారతదేశానికి మంచిది” అని అన్నారు. అయితే ఇంటర్స్టెల్లార్ మూవీ ప్రాజెక్ట్ కోసం $165 మిలియన్లు (రూ.1360 కోట్లు) వెచ్చించారు. ఈ నేపథ్యంలో ఆదిపురుష్ మూవీ బడ్జెట్ గురించి మీమర్లు తెగ ట్రోల్ చేస్తున్నారు.