»Arrest Prakash Raj Hashtag Trending Case Registered Karnataka
Arrest prakashraj: ట్రెండింగ్..కేసు నమోదు!
నటుడు ప్రకాష్ రాజ్(prakash raj) తన రాజకీయాలతో సహా పలు అంశాలపై స్పందిస్తూ తరచుగా వివాదాల్లో చిక్కుకుంటారు. ఇప్పుడు కూడా మళ్లీ అదే జరిగింది. కానీ ఈసారి ఏకంగా చంద్రయాన్ 3 ప్రాజెక్టు సైంటిస్టుల గురించి చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో ప్రకాశ్ రాజ్ ను అరెస్ట్ చేయాలని సోషల్ మీడియాలో #ArrestPrakashRaj హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.
arrest prakash raj hashtag trending case registered karnataka
ఇండియా చంద్రుడిపైకి ప్రయోగించిన చంద్రయాన్ 3(chandrayan 3 )ప్రయోగం నిన్న విజయవంతమైంది. అయితే ఈ ప్రయోగం గురించి హేళన చేసిన నటుడు ప్రకాశ్ రాజ్‌ను అనేక మంది సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అరెస్ట్ ప్రకాశ్ రాజ్(#ArrestPrakashRaj) హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్లో తెగ ట్రెండ్ అవుతోంది. అయితే ప్రకాశ్ రాజ్ గతంలో ఈ చంద్రయాన్ ప్రయోగం గురించి ట్విట్టర్లో కేరళ చాయ్ వాలా కార్టూన్‌ను ప్రస్తావిస్తు ఓ ట్వీట్ చేశారు. పరోక్షంగా అది ఇదే ప్రయోగం గురించి చేశారని చాలా మందికి అర్థమైంది. అయితే ఇప్పుడు చంద్రయాన్ ప్రయోగం సక్సెస్ కావడంతో ప్రకాశ్ రాజ్ ను అనేక మంది విమర్శిస్తున్నారు.
Hate sees only Hate.. i was referring to a joke of #Armstrong times .. celebrating our kerala Chaiwala .. which Chaiwala did the TROLLS see ?? .. if you dont get a joke then the joke is on you .. GROW UP #justaskinghttps://t.co/NFHkqJy532
అంతేకాదు ఈ నటుడిపై ఎఫ్ఐఆర్(FIR) కూడా దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇతనిపై ఇద్దరు ఫిర్యాదు చేశారు. కర్ణాటకలోని హిందూ సంస్థల సభ్యులు బాగల్కోట్ జిల్లాలోని పోలీస్ స్టేషన్లో ప్రకాశ్ రాజ్ పై కేసు పెట్టారు. చంద్రయాన్ 3 మిషన్‌పై ఆయన చేసిన అవహేళన ట్వీట్ నేపథ్యంలో అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు షిమోగాకు చెందిన ప్రమోద్ ఎన్ అనే వ్యక్తి కూడా ఈ నటుడిపై చర్యలు తీసుకోవాలని గవర్నర్‌కు ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. అయితే ప్రకాష్ రాజ్ చేసిన పోస్ట్ ప్రతిపక్ష నేతలను కూడా ఆకట్టుకోలేదు. చాలామంది దీనిని ఇస్రో శాస్త్రవేత్తలను అపహాస్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇస్రోను అపహాస్యం చేయడం సిగ్గుచేటు’ అని అనేక మంది ఈ నటుడిపై కామెంట్లు చేశారు. ప్రభుత్వాన్ని వ్యతిరేకించే రాజ్యాంగ హక్కు మీకు ఉండవచ్చు. కానీ దేశం పట్ల వ్యతిరేకత ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ప్రకాష్‌రాజ్‌ని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
అయితే ట్విట్టర్లో విపరీతమైన విమర్శలు రావడంతో ప్రకాశ్ రాజ్(PrakashRaj)స్పందించారు. తాను కేరళ చాయ్ వాలా కార్టూన్‌ను ప్రస్తావిండం ద్వారా ఎవరికి కోపం వచ్చిందో అర్థం కావడం లేదని ఆయన అన్నారు. అతను ఉపయోగించిన చిత్రం దశాబ్దాల నాటిదని పేర్కొన్నారు. మొత్తానికి తనని తాను కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు.