యువగళం పాదయాత్రలో గుండెపోటుకు గురైన నందమూరి తారకరత్న బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం మెరుగైందని.. చికిత్సకు తారకరత్న స్పందిస్తున్నాడు అనే వార్తతో తెలుగు ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. తారకరత్న ఆరోగ్యంపై క్షణ క్షణం ఉత్కంఠ రేపిన విషయం తెలిసిందే. నందమూరి కుటుంబసభ్యులు కూడా తారకరత్న ఆరోగ్యంతో ఉన్నాడని, ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదని ప్రకటించారు. తారకరత్న కోలుకోవడంపై మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు.
‘సోదరుడు తారకరత్న త్వరగా కోలుకుంటున్నారు.. ఇంకా ఏ ప్రమాదం లేదు అనే మాట ఎంతో ఉపశమనాన్నిచ్చింది. తను త్వరలో పూర్తి స్థాయిలో కోలుకుని ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటూ.. ఈ పరిస్థితి నుండి కాపాడిన ఆ డాక్టర్లకి, ఆ భగవంతుడికి కృతజ్ఞతలు’ అని చిరంజీవి ట్వీట్ చేశారు. తారకరత్న ఆరోగ్యంపై వస్తున్న వదంతులు ఏమీ నమ్మవద్దని నందమూరి కుటుంబసభ్యులు తెలిపారు. తారకరత్న నిరంతరం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. త్వరలో కోలుకుని తిరిగి వస్తాడని వైద్యులు చెబుతున్నారు.
సోదరుడు తారకరత్న త్వరగా కోలుకుంటున్నారు,ఇంక ఏ ప్రమాదం లేదు అనే మాట ఎంతో ఉపశమనాన్నిచ్చింది. తను త్వరలో పూర్తి స్థాయిలో కోలుకుని ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటూ,ఈ పరిస్థితి నుండి కాపాడిన ఆ డాక్టర్లకి ఆ భగవంతుడికి కృతజ్ఞతలు.
May you have a long and healthy life dear Tarakaratna!