»No Matter What I Say About Ex Husband Janasena Chief Pawan Kalyan They Keep Scolding Me
Renu desai: నా విధిరాత ఇంతే ఇలానే తిట్టండి
పవన్ కళ్యాణ్ మాజీ భార్య మళ్లీ తెరమీదకు వచ్చింది. ఈ మధ్య తాను చేసిన ఒక కామెంట్ వలన తనను చాలా మంది విమర్షిస్తున్నారని చెప్పుకొచ్చింది. అప్పడు ఆయన అభిమానులతో ఇప్పుడు ఆయన వ్యతిరేకులతో తిట్లుతింటుందని..తన రాత అంతే అనుకుంటా అంటూ ఒక పోస్ట్ పెట్టింది. అది ఇప్పుడు వైరల్‌గా మారింది.
No matter what I say about ex-husband Janasena chief Pawan Kalyan, they keep scolding me.
Renu Desai: పవన్ కల్యాణ్ (Pawan kalyan) మాజీ భార్య రేణూ దేశాయ్ (Renu Desai) మొన్నామధ్య చేసిన కామెంట్‌కు వైసీపీ మంత్రి సైతం రిప్లై ఇచ్చిన సంగతి తెలిసిందే. పవన్ కల్యాన్ డబ్బు మనిషి కాదని, సమాజం కోసం పని చేసే వ్యక్తి అంటే ఒక వీడియోను విడుదల చేసింది. దాంతో పవన్ అభిమానులకు రేణు విపరీతంగా నచ్చేసింది. ఈ సందర్భంలో ఆయన వ్యతిరేకులు మాత్రం ఆమెను విమర్షించారు. అంబటి రాంబాబు(Ambati Rambabu) సైతం అమ్మా రేణూ.. నీ మాజీని సినిమాల్లో ఇతరుల క్యారెక్టర్లను కాపీ కొట్టకని చెప్పు అని కామెంట్ చేశారు. తాజాగా మరోక వ్యక్తి ఓ కామెంట్ చేశారు. అందుకే పవన్ నిన్ను తన్ని తరిమేశాడు అని రాసుకొచ్చారు. దానికి రేణూ దేశయ్ కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. నన్ను తిట్టడంలో మీకు ఆనందం ఉందా.. లేదంటే, ఇంకా తిట్టండి అని.. పవన్ కల్యాణ్ వ్యతిరేకుల నుంచి నిందలు పడటం నా జీవిత లక్ష్యం అనుకుంటానని రిప్లై ఇచ్చారు.
తన విడాకుల విషయంలో ఏం జరిగిందో నిజం మాట్లాడితే.. అప్పుడు మాజీ భర్త అభిమానులు తిట్టారు. ఇప్పుడు ఈ దేశ పౌరురాలిగా ఆయనకు మద్దతుగా మాట్లాడితే.. ఆయన్ను వ్యతిరేకించేవారు, యాంటీ ఫ్యాన్స్ తిడుతున్నారు. మొదట్లోనేమో తాను వేరే పార్టీ దగ్గర డబ్బులు తీసుకుని ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను అని అన్నారు. ఇప్పుడేమో తన మాజీ భర్త(Pawan kalyan) దగ్గర డబ్బులు తీసుకుని ఇలా మాట్లాడుతున్నానని అంటున్నారని రాసుకొచ్చారు. కానీ తాను అప్పుడైనా ఇప్పుడైనా నిజమే మాట్లాడానని.. ఒక్క మాట కూడా అబద్దం చెప్పలేదన్నారు. నిజాలు చెప్పినందుకు, నిజంగా ప్రేమించినందుకు తగిన మూల్యం చెల్లించుకుంటానిని, ఇదే తలరాత అనుకుంటే..కానివ్వండి. ఈ ప్రస్తుత కామెంట్లపై కూడా తిట్లు(scolding) తిట్టడం స్టార్ట్ చేయండని రేణూ దేశాయ్ బాధపడ్డారు.