»Mass Copying Sri Krishnadevaraya University Students In Exam Hall
SKU Copying అచ్చం సినిమాలో మాదిరి.. పరీక్ష కోసం విద్యార్థుల పాట్లు
పాస్ కావడానికి అష్టకష్టాలు పడతారు. ఈ క్రమంలో కాపీయింగ్ కు పాల్పడుతున్నారు. ఈ కాపీయింగ్ పై వినూత్న ఆలోచనలు చేస్తారు. అదే సమయంలో చదువుకుంటే పరీక్ష సులువుగా రాయొచ్చనే విషయాన్ని మరచిపోతారు.
నేటి తరం విద్యార్థు (Students)ల్లో కొంతమందికి చదువు (Education) అబ్బడం లేదు. విద్యాలయాలు వినోదాలకు కేంద్రాలు అవుతున్నాయి. కళాశాల (College)కు వస్తున్నామా.. వెళ్తున్నామా.. స్కాలర్ షిప్ తీసుకుని ఎంజాయ్ చేశామా? అనే ధోరణిలో కొందరు విద్యార్థులు ఉన్నారు. తీరా పరీక్షల సమయం రాగా వారి చావు తెలివితేటలు ఉపయోగిస్తారు. పాస్ కావడానికి అష్టకష్టాలు పడతారు. ఈ క్రమంలో కాపీయింగ్ (Copying)కు పాల్పడుతున్నారు. ఈ కాపీయింగ్ పై వినూత్న ఆలోచనలు చేస్తారు. అదే సమయంలో చదువుకుంటే పరీక్ష (Exam) సులువుగా రాయొచ్చనే విషయాన్ని మరచిపోతారు. అయితే ఈ కాపీయింగ్ కొత్త తరహాలో చేస్తున్నారు. దీన్ని చూసి అధికారులే విస్తుపోతున్నారు. తాజాగా ఏపీలో వినూత్న రీతిలో కాపీయింగ్ కు పాల్పడుతూ అధికారులకు దొరికిపోయారు. ఫలితంగా వాళ్లు నాలుగేళ్లు పరీక్షలకు దూరమయ్యారు.
అనంతపురము జిల్లా (Ananthapuramu District)లోని శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయ (Sri Krishnadevaraya University) పరిధిలో డిగ్రీ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మార్చి 15వ తేదీన జరిగిన పరీక్షకు విద్యార్థులు, విద్యార్థినులు హాజరయ్యారు. అయితే విద్యార్థులందరూ ఫుల్ హ్యాండ్ షర్ట్స్ (Full Hands Shirts) వేసుకుని వచ్చారు. అధ్యాపకులకు సందేహం వచ్చింది. హ్యాండ్స్ విప్పి చూస్తే మొత్తం జవాబులు కనిపించాయి. ఇక ప్యాంట్ కాళ్లు పైకి లేపి చూడగా కాళ్లపై కూడా జవాబులు రాసుకొచ్చారు. మరికొందరు ఉదరంపై కూడా రాసుకున్నారు. ఇది గ్రహించిన అధ్యాపకులు కాపీయింగ్ కు పాల్పడిన వారిని పరీక్ష కేంద్రం నుంచి బయటకు పంపారు.
ఇక అమ్మాయిలు (Girls Students) పద్ధతిగా వచ్చారు. కానీ ఆ పద్ధతి మాటున కాపీయింగ్ కు పాల్పడ్డారు. ఎటువంటి అనుమానం రాకుండా చున్నీలపై జవాబులు రాసుకొచ్చారు. మరికొందరు అమ్మాయిలు తమ జడ కొప్పుల్లో చీటీలు పెట్టుకుని వచ్చారు. ఇలా కాపీయింగ్ కు పాల్పడుతున్న విద్యార్థులపై అధికారులు చర్యలు తీసుకున్నారు. అనంతపురంలోని ఎస్వీ డిగ్రీ కళాశాల (SV Degree College), ఎల్ఎల్ ఎన్ డిగ్రీ కళాశాల (SLN Degree College) విద్యార్థులు కాపీయింగ్ కోసం ఇంతటి విన్యాసాలు ప్రదర్శించారు. మొత్తం ఆరుగురు విద్యార్థులను అధికారులను డిబార్ చేశారు. మరికొందరిని జవాబు పత్రం లాక్కొని ఇంటికి పంపించారు. ఇంకొందరినీ మందలించి వదిలేశారు. కాగా ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ‘ఏం తెలివితేటలు రా అయ్యా’ అని కొందరు కామెంట్ చేస్తుండగా.. ‘పరీక్ష కోసం అంతగా కష్టపడే బదులు చదివితే అయిపోయేది కదా’ మరికొందరు సూచనలు చేస్తున్నారు.